Maharashtra : మ్యాచ్‌కి పిలవలేదని.. ట్రాక్టర్ తీసుకొచ్చి పిచ్ తవ్వేశాడు.. లైవ్‌లో.. వీడిమో వైరల్
మహారాష్ట్రలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మ్యాచ్ ప్రారంభోత్సవానికి పిలవలేదని ఓ వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ట్రాక్టర్‌ను స్టేడియంలోకి తీసుకొచ్చి ఏకంగా పిచ్‌ను దున్నేశాడు.
- Harishth Thanniru
- Published on- April 19, 2026 / 01:27 PM IST
Maharashtra
- మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో విచిత్ర ఘటన
- క్రికెట్ మైదానంలో పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నిన వ్యక్తి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
Maharashtra : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రీడకు ఎంతో ఆదరణ ఉంది. ఇక ఇండియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ గల్లీలో, పల్లె, పట్టణం అనే తేడాలేకుండా చిన్నవారి నుంచి యువత, పెద్దవారి వరకు క్రికెట్ ఆడుతుంటారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్థానికంగా క్రికెట్ టోర్నమెంట్‌లనుసైతం నిర్వహిస్తుంటారు. అయితే, మహారాష్ట్రలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మ్యాచ్ ప్రారంభోత్సవానికి పిలవలేదని ఓ వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ట్రాక్టర్‌ను స్టేడియంలోకి తీసుకొచ్చి ఏకంగా పిచ్‌ను దున్నేశాడు.
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా ధారణ్ గాన్ ప్రాంతంలో ఓ రాజకీయ నాయకుడు సహకారంతో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ను కొంతమంది రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. కానీ, స్థానికంగా ఉన్న ఓ రాజకీయ నేత అనుచరుడు టోర్నీ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదనే కోపంతో.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి ట్రాక్టర్‌తో వచ్చి పిచ్‌ను దున్నేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026
మ్యాచ్ జరుగుతుండగా పిచ్ మొత్తం ట్రాక్టర్‌తో దున్నేసిన సంఘటనపై టోర్నమెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
