×
Ad

U19 World Cup 2026 : సెమీస్‌లో వైభ‌వ్ విధ్వంసం.. అఫ్గాన్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు..

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్‌లో (U19 World Cup 2026 ) అఫ్గాన్‌తో మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ దుమ్ములేపాడు.

U19 World Cup 2026 IND vs AFG 68 runs from just 33 balls in the Semi final while chasing 311 runs

U19 World Cup 2026 : అండ‌ర్‌19 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సెమీస్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ చెల‌రేగిపోయాడు. 311 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఎడా పెడా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. కేవ‌లం 24 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీని పూర్తి చేస్తున్నాడు. మొత్తంగా 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 68 ప‌రుగులు చేశాడు.

ICC T20I rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిష‌న్ దూకుడు.. ఏకంగా 32 స్థానాలు జంప్‌..

నూరిస్తానీ ఒమర్‌జాయ్ బౌలింగ్లో ఉస్మాన్ సాద‌త్ క్యాచ్ అందుకోవ‌డంతో వైభ‌వ్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. కాగా.. ఆరోన్ జార్జ్ తో క‌లిసి వైభ‌వ్ 9.3 ఓవ‌ర్ల‌లో 90 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

T20 World Cup : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టింది ఎవ‌రో తెలుసా? టాప్‌-5లో ఇద్ద‌రు టీమ్ఇండియా ప్లేయ‌ర్లు?

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జ‌ట్టు ఫైసల్ షినోజాడా (110; 93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా నియాజై (101 నాటౌట్ ;86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు శ‌త‌కాలు బాద‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 310 ప‌రుగులు చేసింది. ఉస్మాన్ సాదత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) లు రాణించగా.. భార‌త బౌల‌ర్ల‌లో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.