Vaibhav Sooryavanshi : మ‌రోసారి వైభ‌వ్ సూర్య‌వంశీ విఫ‌లం.. బుడ్డోడికి ఏమైంది?

ఐపీఎల్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో మాత్రం ఆ జోరును కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు.

Vaibhav Sooryavanshi Another failer in Tri Nation A Series in Sri Lanka 2026

  • శ్రీలంక ప‌ర్య‌ట‌న‌ల‌లో విఫ‌లం అవుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ
  • వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ
  • ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో మాత్రం ఆ జోరును కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు. భార‌త్-ఏ త‌రుపున వైభ‌వ్ (Vaibhav Sooryavanshi ) వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించ‌క‌లేక‌పోయాడు.

సోమ‌వారం దంబుల్లా వేదిక‌గా శ్రీలంక‌-ఏతో మ్యాచ్‌లో 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 21 ప‌రుగులు మాత్ర‌మే చేసి సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో వ‌నుజా సహన్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

*Deepti Sharma : హ‌నుమాన్ జీ ద‌య వ‌ల్లే ఇదంతా.. భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ కామెంట్లు..

దూకుడుగా ఆడే ప్ర‌య‌త్నంలో..

ముక్కోణ‌పు సిరీస్ మూడు మ్యాచ్‌ల్లోనూ వైభ‌వ్ సూర్య‌వంశీ దూకుడుగా ఆడే క్ర‌మంలో త‌న వికెట్‌ను కోల్పోతున్నాడు. టీ20ల్లో అయితే దూకుడుగా ఆడ‌డం ఒకే కానీ.. వ‌న్డేల్లో రాణించాలంటే మాత్రం కాస్త ఓపిక‌గా ఆడాల్సిందే. టీ20ల్లో వేగంగా 20-30 ప‌రుగులు చేస్తే మంచి బ్యాట‌ర్ కింద లెక్క‌నే గానీ.. వ‌న్డేల్లో మాత్రం అలాకాదు.. పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది.

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ముక్కోణ‌పు సిరీస్‌లో వైభ‌వ్.. శ్రీలంక‌-ఏతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 14 ప‌రుగులు చేయ‌గా అఫ్గాన్‌-ఏతో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో 44 ప‌రుగులు చేశాడు. ఇక తాజాగా శ్రీలంక‌-ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో 21 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు.

*Fatima Sana : ఆ త‌ప్పు వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా స‌నా కామెంట్లు..

వైభ‌వ్ ఇలా వ‌రుస‌గా విఫ‌లం అవుతుండ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఇది అత‌డి అంత‌ర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని క్రికెట్ పండితులు చెబుతున్నారు.