Vaibhav Sooryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Vaibhav Sooryavanshi creates history become first player 60 sixes in an IPL season (pic credit@ipl)

  • వైభ‌వ్ సూర్య‌వంశీ అరుదైన ఘ‌న‌త‌
  • ఓ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా
  • క్రిస్‌గేల్‌ను అధిగ‌మించి

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. బుధ‌వారం న్యూ చండీగఢ్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు పెను విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 29 బంతుల్లోనే 97 ప‌రుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ ఏడో సిక్స్ కొట్టిన త‌రువాత ఐపీఎల్ చ‌రిత్రలో ఓ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్‌గేల్ ను అధిగ‌మించాడు. 2012లో క్రిస్‌గేల్ 59 సిక్స‌ర్లు బాద‌గా.. తాజా మ్యాచ్‌లో అన్ని సిక్స‌ర్లు క‌లిపి వైభ‌వ్ 65 సిక్స‌ర్లు కొట్టాడు. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడే అవ‌కాశం ఉండ‌డంతో వైభ‌వ్ సిక్స‌ర్ల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.

Pat Cummins : వైభ‌వ్ సూర్య‌వంశీ కానే కాదు.. అదే మా కొంప‌ముంచింది.. లేదంటేనా.. పాట్ క‌మిన్స్ కామెంట్స్

ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో 60 సిక్స‌ర్లు దాటిన ఏకైక ఆట‌గాడిగానూ వైభ‌వ్ సూర్య‌వంశీ నిలిచాడు.

ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

* వైభ‌వ్ సూర్య‌వంశీ – 65* సిక్స‌ర్లు (ఐపీఎల్ 2026లో)
* క్రిస్‌గేల్ – 59 సిక్స‌ర్లు (ఐపీఎల్ 2012లో)
* ఆండ్రీ రస్సెల్ – 52 సిక్స‌ర్లు (ఐపీఎల్ 2019లో)
* క్రిస్ గేల్ – 51 సిక్స‌ర్లు (ఐపీఎల్ 2013లో)
* జోస్ బ‌ట్ల‌ర్ – 45 సిక్స‌ర్లు (ఐపీఎల్ 2022లో)