Vaibhav Sooryavanshi : సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్.. గేల్ సిక్సర్ల రికార్డు పై వైభవ్ సూర్యవంశీ కన్ను..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) అరుదైన రికార్డు ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- May 27, 2026 / 10:05 AM IST
Vaibhav Sooryavanshi need 7 for the all time record for the most sixes in a single IPL season (pic credit@ipl)
- ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఎలిమినేటర్ మ్యాచ్ నేడు
- అరుదైన రికార్డు పై వైభవ్ సూర్యవంశీ కన్ను
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధించనుండగా, ఓడిపోయిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. ఆర్ఆర్‌కు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో 41.64 సగటు 232.27 స్ట్రైక్‌రేటుతో 583 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వైభ్ 50 ఫోర్లు, 53 సిక్సర్లు బాదాడు.
ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ మరో ఏడు సిక్సర్లు కొడితే ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2012లో ఐపీఎల్‌లో గేల్ 59 సిక్సర్లు బాదాడు.
ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు ప్లేయర్లు వీరే..
* క్రిస్ గేల్ – 59 సిక్సర్లు (ఆర్‌సీబీకి ఆడుతూ 2012లో)
* వైభవ్ సూర్యవంశీ – 53 సిక్సర్లు (రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతూ 2026లో)
* ఆండ్రీ రస్సెల్ – 52 సిక్సర్లు (కేకేఆర్‌కి ఆడుతూ 2019లో)
* క్రిస్ గేల్ – 51 సిక్సర్లు (ఆర్‌సీబీకి ఆడుతూ 2013లో)
* అభిషేక్ శర్మ – 42 సిక్సర్లు (ఎస్ఆర్‌హెచ్‌కు ఆడుతూ 2024లో)
