Vaibhav Sooryavanshi : గుజరాత్ పై వైభవ్ సూర్యవంశీ 68 పరుగులు చేస్తే.. మరో చరిత్ర..
గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) ఓ రికార్డు ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 28, 2026 / 02:28 PM IST
Vaibhav Sooryavanshi needs 68 runs to 1000 runs in IPL (pic credit@ipl)
- శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్
- వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న రికార్డు
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక వైభవ్ 68 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టిస్తాడు.
వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 22 మ్యాచ్‌లు ఆడాడు. 42.36 సగటు, 231.84 స్ట్రైక్‌రేటుతో 932 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఐదు అర్థశతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 72 ఫోర్లు కొట్టగా 89 సిక్సర్లు బాదాడు. మరో 11 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ మ్యాచ్‌కు చేరుకుంటుంది. ఆదివారం (మే 31) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కప్పు కోసం పోటీపడనున్నాయి.
హెడ్-టు-హెడ్ రికార్డు..
గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 10 సందర్భాల్లో తలపడ్డాయి. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.
