Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వయసులోనే కోట్లు కొల్లగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ప్రమోట్ చేసిన బ్రాండ్లు ఇవే..
టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- August 11, 2026 / 12:16 PM IST
Vaibhav Sooryavanshi Net Worth 5 Brands Endorsed Age Of 15
Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రతిభతో 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఆటలోనే కాదు వాణిజ్య పరంగానూ అతడు దూసుకుపోతున్నాడు.
వైభవ్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి అద్భుతమైన ఆటతీరుతో ప్రముఖ బ్రాండ్లు సైతం అతడితో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఒక్కో బ్రాండ్ డీల్‌కు రూ.1 కోటి పైనే!
ఐపీఎల్2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి బ్రాండ్ విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్‌కు అతడు రూ.1 కోటి కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ravindra Jadeja : శ్రీలంకతో టెస్టు సిరీస్.. రవీంద్ర జడేజాను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
అదే సమయంలో అతడి మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు అతడి సంపాదనలో ప్రధాన భాగంగా ఉన్నాయి.
కాగా.. వైభవ్ ఇంకా టీనేజర్ కావడంతో పెద్ద సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అతడి కుటుంబం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అతడి బ్రాండ్ మార్కెట్ మాత్రం వేగంగా విస్తరిస్తోంది.
వైభవ్ సూర్యవంశీతో జతకట్టిన బ్రాండ్లు ఇవే..
ఎస్ఎస్ బ్యాట్స్ (సరీన్ స్పోర్ట్స్) : సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో MRF బ్యాట్‌తో ఎంతగా గుర్తింపు పొందాడో, వైభవ్ కూడా తన బ్యాట్ విషయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్‌కు చెందిన SSతో వైభవ్‌కు సుమారు రూ.50 లక్షల వార్షిక విలువైన కాంట్రాక్ట్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అతడి పేరుతో ప్రత్యేకంగా “Vaibhav Suryavanshi Edition” బ్యాట్లను కూడా SS మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
కాంప్లాన్ : 2026 ప్రారంభంలో వైభవ్ థోడా ప్లాన్, థోడా కాంప్లాన్ ప్రచారంలో భాగం అయ్యాడు. యువ క్రికెటర్‌గా అతడి క్రమశిక్షణ, పోషకాహారం, కష్టపడి పనిచేసే విధానానికి ఈ ప్రచారం అనుగుణంగా ఉండటం విశేషం.
గూగుల్ పే : తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన UPIని ఉపయోగిస్తూ, యువతలో సురక్షితమైన నగదు నిర్వహణపై అవగాహన కల్పించేలా ఈ ప్రచారం రూపొందించారు.
రెడ్ బుల్..
2026 ఐపీఎల్ సమయంలో తన సహచర రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్‌తో కలిసి వైభవ్ రెడ్‌బుల్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఈ ఛాలెంజ్‌లో 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి వచ్చింది.
జార్ఖండ్ ఆరోగ్య శాఖ..
యువతను చురుకుగా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించేందుకు వైభవ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి 2026 మేలో ప్రకటించారు.
