Vaibhav Sooryavanshi : అరంగ్రేటం చేస్తున్న విష‌యాన్ని ముందుగా వైభ‌వ్ సూర్య‌వంశీ ఎవ‌రికి చెప్పాడంటే?

ఎట్ట‌కేల‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు.

Vaibhav Sooryavanshi Reveals Person Who Got To Know About His Debut Before Anyone Else

  • ఎట్ట‌కేల‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ
  • శ‌నివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా

Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా టీనేజ్ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ చ‌రిత్ర సృష్టించాడు. శ‌నివారం అత‌డు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన అతి పిన్న వ‌య‌స్కుడైన భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. స‌చిన్ టెండూల్క‌ర్ 16 ఏళ్ల 205 రోజుల వ‌య‌సులో అరంగ్రేటం చేయ‌గా.. వైభ‌వ్ 15 ఏళ్ల 99 రోజుల వ‌య‌సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు.

తిల‌క్ వ‌ర్మ చేతుల మీదుగా..

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ చేతుల మీదుగా వైభ‌వ్ సూర్య‌వంశీ క్యాప్ అందుకున్నాడు. ‘అన్నిటికంటే ముందు.. ఇది నీకు, నీ కుటుంబానికి గర్వకారణమైన క్షణం. నీ విజ‌యం కోసం వాళ్లు ఎంతో కష్టపడ్డారు. నీ కష్టంతో ఈ క్రికెట్ క్యాప్‌ను సంపాదించుకున్నావు. నిర్భయంగా ఆడు. ఇక్కడ ఏమీ మారదు. సరైన దృక్పథంతో, ముఖంలో చిరునవ్వుతో ఆడు.’ అని సూర్యవంశీతో తిలక్ వర్మ చెప్పాడు.

Shreyas Iyer : ఓట‌మిపై స్పందించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఆ ఒక్క ఓవ‌రే మా కొంప‌ముంచింది

తాను అరంగ్రేటం చేస్తున్నాను అనే విష‌యం తెలియ‌గానే వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంతో సంతోషించాడు. ఇక తొలుత విష‌యాన్ని త‌న తండ్రి సంజీవ్‌కు చెప్పాడు.

‘చాలా బాగుంది. భారతదేశం తరపున ఆడటం అనేది ఏ భారతీయుడికైనా అతిపెద్ద విషయం. ఎందుకంటే ప్రతి క్రికెటర్ దేశానికి ప్రాతినిధ్యం వహించి, దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటాడు. నాకు విష‌యం తెలిసిన వెంట‌నే.. ముందుగా నా గదిలోకి వెళ్లి మా నాన్నకు చెప్పాను. ఆయన నాతోనే ఉంటున్నారు. నేను మొదట ఆయనకే చెప్పాను. మరెవరికీ చెప్పలేదు. ఆత‌రువాత‌ మా అమ్మకు, నా కోచ్ రోమీ సార్‌కు కూడా చెప్పాను. నాన్న సంతోషించారు. నన్ను ఇలాగే కొనసాగించమని చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేదని, నీ ఆటను నువ్వు నమ్ముకో.’ అని అన్నార‌ని సూర్యవంశీ తెలిపాడు.

అయితే.. అరంగ్రేట మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ విఫ‌లం అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొని రెండు సిక్స‌ర్ల సాయంతో 14 ప‌రుగులు చేశాడు. విల్ జాక్స్ బౌలింగ్ భారీ షాట్ కొట్టేందుకు ప్ర‌య‌త్నించి స్టంపౌట్ అయ్యాడు.