Vaibhav Sooryavanshi : క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు ముందు.. గుజ‌రాత్‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ మెసేజ్‌..

ఐపీఎల్ 2026లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) 29 బంతుల్లో 97 ప‌రుగులు చేశాడు.

Vaibhav Sooryavanshi Sends Message To GT Ahead Of Qualifier 2

  • క్వాలిఫ‌య‌ర్‌-2లో నేడు గుజ‌రాత్‌తో త‌ల‌ప‌డ‌నున్న రాజ‌స్థాన్
  • గిల్ సేన‌కు వైభ‌వ్ వార్నింగ్
  • గెలిచి ఫైన‌ల్‌కు వెళ్తాం..

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ 29 బంతుల్లో 97 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఐపీఎల్‌లో అత్యంత వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన క్రిస్ గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశాన్ని తృటిలో కోల్పోయాడు. అయితే.. ఈ రికార్డు మిస్ అయినందుకు 15 ఏళ్ల వైభ‌వ్‌ ఏ మాత్రం బాధ‌ప‌డ‌లేదు స‌రికదా త‌న జ‌ట్టు గెలిచినందుకు ఎంతో సంతోషించాడు.

త‌న‌కు సెంచ‌రీ క‌న్నా జ‌ట్టు గెలిపే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంద‌న్నాడు. తాను సెంచ‌రీ చేసిన‌ప్పుడు జ‌ట్టు గెల‌వ‌క‌పోయినా, 80 ప‌రుగులు చేసిన‌ప్పుడు జ‌ట్టు గెలిస్తే.. త‌న‌కు 80 ప‌రుగుల ఇన్నింగ్సే గొప్ప అని చెప్పుకొచ్చాడు. ఇక శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లోనూ తన దూకుడు స్వభావాన్ని మార్చుకోనని కూడా సూర్యవంశీ వెల్లడించాడు.

Vaibhav Sooryavanshi : ఇదేం పోలిక‌రా మామ‌.. వైభవ్ సూర్య‌వంశీ మరో ‘అఫ్రిది’ నా..

చిన్నప్పటి నుండి మా నాన్న నాకు ఎప్పుడూ ఒకటే చెబుతుంటారు. అదేంటంటే.. నువ్వు వంద, రెండు వందలు, లేదా మూడు వందల‌ పరుగులు చేసినా కూడా దానివల్ల జట్టు గెలవకపోతే ఆ పరుగులకు విలువ ఉండదు. అవి కేవలం నీ వ్యక్తిగత రికార్డు కోసమే ఉండొచ్చు. కానీ వాటివల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతిమంగా క్రికెట్ అనేది ఒక జట్టు ఆట అని చెప్పిన‌ట్లు సూర్య‌వంశీ తెలిపాడు.

అందుక‌నే.. నాకు వందకు బదులుగా 80 పరుగులు చేసిన‌ప్పుడు జట్టు గెలిచినా, నేను సెంచరీ చేసినప్పటికీ జ‌ట్టు గెలవకపోయినా.. అప్పుడు ఆ 80 పరుగులే త‌న‌కు వంద కన్నా ఎక్కువ విలువైనవి. నా జట్టు టోర్నమెంట్‌లో ప్లేఆఫ్స్‌, ఫైన‌ల్ ల‌లో ఎంత వ‌ర‌కు వెళ్ల‌గ‌లుగుతుందో అప్పుడు నాకు సెంచ‌రీలు చేయ‌డానికి, రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డానికి అన్ని ఎక్కువ అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఇది వ్యక్తిగతంగా నాకు, జట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అని చెప్పాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా మెడ‌పై వేలాడుతున్న క‌త్తి! కెప్టెన్సీ పోవ‌డం ఖాయ‌మే! ఆట‌గాడిగా కూడా చోటులేదా?

క్వాలిఫయర్ 2లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్‌తో తలపడనున్న నేపథ్యంలో సూర్యవంశీ తన ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేశాడు.

“మేము మంచి మనస్తత్వంతో, సానుకూల ఉద్దేశ్యంతో బరిలోకి దిగి, టోర్నమెంట్ అంతటా జట్టు మొత్తం చేసిన దానిని కొనసాగించాలని చూస్తున్నాము. మేము ఎల్లప్పుడూ చేసే విధంగానే ఆటను ఆస్వాదించడం కొనసాగించాలి. పెద్ద మ్యాచ్ అని ఒత్తిడికి లోనుకాకుండా, మా బలాలపై నమ్మకం ఉంచాలి. ఒక జట్టుగా, ఐక్యంగా మేము ఫైనల్స్‌కు చేరుకుని, ఆశాజనకంగా ట్రోఫీని గెలవాలనుకుంటున్నాము. అని వైభ‌వ్ తెలిపాడు.