Vaibhav Suryavanshi : మ్యాచ్‌కు ముందు నేను ఆ వీడియోలు చూస్తా.. రిలాక్స్ అయిపోతా.. వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న వైభవ్ సూర్య వంశీ.. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఈ బుడ్డోడికి బౌలింగ్ వేయాలంటే అనుభవమున్న బౌలర్లు సైతం కాస్త వెనుకాముందు ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే, తాజాగా.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో 15ఏళ్ల యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న వైభవ్ సూర్య వంశీ.. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఈ బుడ్డోడికి బౌలింగ్ వేయాలంటే అనుభవమున్న బౌలర్లు సైతం కాస్త వెనుకాముందు ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రపంచ ఫాస్ట్ బౌలర్లలో టాప్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలింగ్‌లోనూ ఈ బుడ్డోడ్డు బౌండరీల మోత మోగించాడు. అయితే, తాజాగా సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : IPL 2026 : గెలిచే మ్యాచ్ ఓడాం.. వాళ్లవల్లే ఇదంతా.. నా తప్పు కూడా ఉంది.. రిషబ్ పంత్ కీలక కామెంట్స్..

బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్య వంశీ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కార్టూన్లు చూసే వయస్సులో మీరు బౌలర్ల బంతులను కార్టూన్లులా మార్చేస్తున్నారు.. క్రీజులో బ్యాటుతో ఉన్న సమయంలో మీ మనస్సులో ఏం జరుగుతోంది..? అని ప్రశ్నించగా.. వైభవ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.

‘నేను ఇప్పటికీ కార్టూన్లు చూస్తుంటా. ప్రతి మ్యాచ్‌కు ముందు ఇలా కార్టూన్లు చూసే అలవాటు ఉంది. చాలా రిలాక్స్ అయిపోతా. ఇలా ఆడాలి.. అలా ఆడాలని నేను పెద్దగా ఆలోచించను.. అలా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోను. ఇప్పడీ మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేయలేకపోయినా అలాగని డీలా పడిపోను. తరువాత మ్యాచ్‌లో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా అంటూ వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.


బుధవారం రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 159/6 స్కోరు చేసింది. ఆ తరువాత లక్నో సూపర్ జెయింట్స్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసి 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవీంద్ర జడేజా 29 బంతుల్లో 49 పరుగులు చేసి, 1/29తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే, ఈ మ్యాచ్ లో సూర్యవంశీ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాయి. అయితే, అతడి ఖాతాలో రెండు రికార్డులు నమోదయ్యాయి.

ఐపీఎల్ లో 500 పరుగులు చేసిన అతిపిన్న వయసక్కుడిగా వైభవ్ నిలిచాడు. ఇక బంతులపరంగానూ వేగవంతమైన 500 పరుగుల మైలురాయిని వైభవ్‌ అందుకొన్నాడు. అతడు కేవలం 227 బంతుల్లోనే సాధించడం గమనార్హం. ఇప్పటివరకూ ఆ రికార్డు గ్లెన్ మాక్స్‌వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. ఇక ప్రియాంశ్‌ ఆర్య (278), వీరేంద్ర సెహ్వాగ్ (280), నమన్ ధిర్ (283) తర్వాత స్థానాల్లో ఉన్నారు.