Vijay Mallya : అప్పుడు న‌న్ను చూసి న‌వ్వారు.. ఆర్‌సీబీకి ఆ పేరు ఎందుకు పెట్టానంటే.. విజ‌య్ మాల్యా హాట్ కామెంట్స్‌..

ఆర్‌సీబీ భారీ డీల్ పై విజయ్ మాల్యా (Vijay Mallya) స్పందించాడు.

Vijay Mallya Respond on RCB Record Breaking Sale

  • భారీ మొత్తానికి అమ్ముడైన ఆర్‌సీబీ
  • విజ‌య్ మాల్యా ఆస‌క్తిక‌ర కామెంట్స్‌
  • 2008లో ఆర్‌సీబీని కొన్న‌ప్పుడు అంద‌రూ న‌వ్వారు

Vijay Mallya : ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్రాంచైజీ ఏకంగా 16,500 కోట్ల రూపాయ‌ల భారీ మొత్తానికి విక్ర‌యించ‌బ‌డింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌, టైమ్స్ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచ‌ర్స్‌తో కూడిన క‌న్సార్షియం ఆర్‌సీబీని కొనుగోలు చేసింది. ఐపీఎల్ చ‌రిత్రలోనే అత్య‌ధిక ఖ‌రీదైన డీల్‌గా ఇది నిలిచింది. కాగా.. ఈ డీల్ పై ఆర్‌సీబీ మాజీ య‌జ‌మాని విజ‌య్ మాల్యా స్పందించాడు. భారీ మొత్తానికి అమ్ముడుపోవ‌డంపై ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. అదే స‌మ‌యంలో తాను ఆర్‌సీబీని కొన్న స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకున్నాడు.

ఆర్‌సీబీ జ‌ట్టును 2008లో 450 కోట్ల రూపాయ‌ల‌కు తాను కొన్న‌ట్లు విజ‌య్ మాల్యా చెప్పాడు. ఆ స‌మ‌యంలో త‌న నిర్ణ‌యాన్ని చాలా మంది త‌ప్పుబ‌ట్టార‌ని, న‌వ్వుకున్నార‌ని అన్నాడు. కేవ‌లం ఆడంబ‌రం కోసమే తాను ఇదంతా చేస్తున్నాన‌ని, డ‌బ్బు వృథా కావ‌డం త‌ప్పించి మ‌రేమీ లేద‌ని వారంతా అనుకున్న‌ట్లు చెప్పాడు.

IPL : జట్ల మీద వేల కోట్లు జల్లుతున్నారు.. ఐపీఎల్‌లో వీళ్లకి డబ్బెలా వస్తుంది? రాబడి ఎలా?

అయితే.. తాను ఆర్‌సీబీని కొనుగోలు చేయ‌డం వెనుక ఓ పెద్ద ఆలోచ‌న ఉంద‌న్నాడు. ‘రాయ‌ల్ ఛాలెంజ్’ బ్రాండ్‌ను నిర్మించాల‌ని అనుకున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. అందుక‌నే టీమ్‌కు ఆర్‌సీబీ అని పేరు పెట్టిన‌ట్లుగా వివ‌రించాడు. అప్పుడు తాను పెట్టిన 450 కోట్ల రూపాయ‌లు ఇప్పుడు 16500 కోట్ల‌కు పెర‌గ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఒక‌డైన కోహ్లీని యువ ఆట‌గాడిగా ఉన్న‌ప్పుడే ఎంపిక చేయ‌డంతో పాటు ఎన్నో జ్ఞాప‌కాలు ఆర్‌సీబీతో ఉన్నాయ‌న్నాడు.

Ruturaj Gaikwad : ఎవ‌రి కోసం త్యాగం చేయ‌ను.. ఈ సీజ‌న్‌లో నేనే ఓపెనింగ్ చేస్తా.. నాతో పాటు ఎవ‌రంటే.. రుతురాజ్ గైక్వాడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఇక కొత్త య‌జ‌మానుల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని, అంతా మంచే జ‌ర‌గాలని కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఇక ఆర్‌సీబీకి ఎప్పుడూ మ‌ద్ద‌తు ఇస్తూనే ఉండండి అంటూ విజ‌య్ మాల్యా సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.