Heinrich Klaasen : కాస్లెన్ కాకకు కన్నీళ్లు తెప్పించిన హైదరాబాదీ బిర్యానీ.. పడి పడి నవ్వుకున్న ఇషాన్ కిషన్.. సిక్సర్లు కొట్టినంత ఈజీ కాదు
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- April 7, 2026 / 12:36 PM IST
Viral Video Heinrich Klaasen Cries While Eating Hyderabadi Biryani
Heinrich Klaasen : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనపడాల్సిందే. బంతి పడితే బౌండరీ అన్న స్థాయితో అతడి విధ్వంసం ఉంటుంది. గ్రౌండ్‌లో ప్రత్యర్థి బౌలర్లకు కన్నీళ్లు తెప్పించే క్లాసెన్‌కు కన్నీళ్లు తెప్పించిందో ఓ వంటకం. అది మరేదో కాదు హైదరాబాద్ బిర్యానీ. ఈ విషయాన్ని తెలుగు తేజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
ఏప్రిల్ 5న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన బెడితే.. ఎలాగో హైదరాబాద్‌కు వచ్చారు కాబట్టి ఇక్కడి స్పెషల్ అయిన హైదరాబాద్ బిర్యానీని తినాలని సన్‌రైజర్స్ ఆటగాళ్లు భావించారు.
కెప్టెన్ ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు మరికొందరు ఓ హోటల్‌కు వెళ్లారు. అయితే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. హెన్రిచ్ క్లాసెన్‌కు చుక్కలు కనపడ్డాయి. ఓ రెండు మూడు ముద్దలు తిన్నాడో లేదో.. బిర్యానీ ఘాటుకు అతడికి చెమటలు పట్టి, కళ్లలోంచి నీళ్లు ధారలుగా కారడం మొదలైంది. వెంటనే అతడు ఓ ఖర్చీఫ్ తీసుకుని తుడుకుంటూ కనిపించాడు. దీన్ని చూసిన ఇషాన్ కిషన్ పడి పడి నవ్వుకున్నాడు.
అబ్బాయి నుంచి అమ్మాయిగా.. క్యూట్ ఫోటోలను షేర్ చేసిన అనయ బంగర్..
ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నితీశ్ రెడ్డి.. అతడు ఇబ్బంది ఏకైక సమయం ఇదే అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. క్లాసెన్ కాక.. హైదరాబాదీ బిర్యానీ అంటే ఏమనుకున్నావు.. మైదానంలో సిక్సర్లు కొట్టినంత ఈజీ అనుకుంటివా? అని కామెంట్లు చేస్తున్నారు.
