Rishabh Pant : పంత్ కొట్టిన బంతి డ్రోన్‌ను తాకిందా? వైరల్ వీడియో..
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొట్టిన ఓ బంతి డ్రోన్‌ను తాకగా.. ఆ డోన్ కిందపడి పాడైపోయినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 8, 2026 / 11:12 AM IST
viral video showing Rishabh Pant shot hitting drone is it real
- రిషబ్ పంత్ కొట్టిన ఓ షాట్‌కు డ్రోన్ ను తాకిన బంతి
- దెబ్బకు కింద పడి పాడైన డ్రోన్!
- వైరల్ వీడియోలో నిజమెంతా?
Rishabh Pant : ముల్లాన్‌పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కొట్టిన ఓ బంతి డ్రోన్‌ను తాకగా.. ఆ డోన్ కిందపడి పాడైపోయినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. ఈ వీడియో నిజం కాదు. సాధారణంగా టెస్టు మ్యాచ్‌ల్లో ఎరుపు రంగు బంతులను వాడతారు. అయితే.. ఈ వీడియోలో మాత్రం వైట్ బాల్ కనిపించింది. వన్డేలు, టీ20ల్లో మాత్రమే వైట్ బాల్‌ను వాడతారు. ఇక బంతి గమనంలో కూడా తేడా కనిపించింది. ఇది ఏఐ జనరేటెడ్ వీడియోగా అర్థమవుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 121 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.
