Heinrich Klaasen: SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెస్ మాస్ వార్నింగ్.. ‘నేనటు తిరుగుతా.. నువ్వు మళ్లీ అదే పనిచేస్తే.. కిందపడేసి..’
Heinrich Klaasen Warns Fan: సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) సహనాన్ని కోల్పోయాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 1, 2026 / 03:47 PM IST
Viral video Sunrisers Hyderabad player Heinrich Klaasen warning a fan (PIC CREDIT@IPL)
- ఫోటో తీయొద్దు అని చెప్పినా వినని అభిమాని
- సహనం కోల్పోయిన సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్
- గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశాడు
Heinrich Klaasen : సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సహనాన్ని కోల్పోయాడు. ఓ అభిమాని అనుమతి లేకుండా తనతో పాటు తన కుటుంబాన్ని వీడియో తీస్తుండడంపై క్లాసెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడిని అలా చేయవద్దని కోరాడు. అయినప్పటికి కూడా సదరు అభిమాని వినిపించుకోకపోవడంతో కాస్త సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియోలో ఏముందంటే?
ఆ ఫ్యాన్ అనుమతి లేకుండా క్లాసెన్‌తో పాటు అతని కుటుంబాన్ని వీడియో తీయడం ప్రారంభించాడు. మొదట క్లాసెన్ అతనిని ఆపమని ప్రశాంతంగా చెప్పాడు. ‘అలా చేయకు, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను, అలా చేయకు సరేనా’ అని క్లాసెన్ అన్నాడు. కానీ ఫ్యాన్ ఆపకుండా ఎస్ఆర్‌హెచ్ బాగా ఆడించదని అని అన్నాడు. వెంటనే క్లాసెన్’ చాలా ధ్యనవాదాలు, కానీ ఫోటోలు, వీడియోలు తీయకండి. నేను వెన్కక్కి తిరిగినప్పుడు మీరు నా ఫోటో, నా కుటుంబం ఫోటో తీస్తే.. నేల మీద పడేస్తా.’ అంటూ సీరియస్‌గా చెప్పాడు.
ఈ వీడియో వైరల్‌గా మారగా.. కొందరు క్లాసెన్‌ను సపోర్టు చేస్తుంటే మరికొందరు అలా అనడం తప్పని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా క్రికెటర్లకు కూడా కాస్త ప్రైవసీ ఉంటుందనే విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు.
POV: meeting a foreign cricketer in India…. Dude just give him and his family some privacy for gods sake.
What a man Klaasy 🙏 cinema lo hero villain ki warning ela isthado ala ichadu 😂🔥 good man 🧡#SRH #IPL2026 pic.twitter.com/imwBT2c8wi
— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) April 30, 2026
ఇక ఈ ఈ సీజన్‌లో కాస్లెన్ అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 59.14 సగటు 157.41 స్ట్రైక్‌రేటుతో 414 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
