Viral Video : ఈవీడియో చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. ర‌నౌట్ చేసేందుకు చిన్నారుల పాట్లు.. అయ్యో పాపం

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం చూస్తూనే ఉంటాం.

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం చూస్తూనే ఉంటాం. అలాంటి స‌ర‌దా ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే.. ఇది చిన్న‌పిల్ల‌లు ఆడుకున్న క్రికెట్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. బ్యాట‌ర్‌ను ర‌నౌట్ చేసేందుకు ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు చేసిన ప‌ని న‌వ్వులు పూయిస్తోంది. మూడు నాలుగు సార్లు ట్రై చేసినా ఔట్ చేయ‌లేక‌పోయారు. చివ‌రి స‌ద‌రు బ్యాట‌ర్ క్రీజును చేరుకోవ‌డంతో ర‌నౌట్ నుంచి త‌ప్పించుకున్నాడు.

ఆ వీడియోలో ఏం ఉందంటే.. బౌల‌ర్ వేసిన బంతిని బ్యాట‌ర్ షాట్ ఆడాడు. ఆ బాల్ నేరుగా ఫీల్డ‌ర్ వ‌ద్ద‌కే వెళ్లింది. దాన్ని అందుకున్న అత‌డు బౌలింగ్ ఎండ్ వైపు విసిరి వేశాడు. అప్ప‌టికే షాట్ ఆడిన బ్యాట‌ర్ ర‌న్‌కోసం ప‌రిగెత్తుకుంటూ బౌల‌ర్ ఎండ్ క్రీజును చేరుకున్నాడు. అయితే.. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట‌ర్ కూడా అదే క్రీజులో ఉన్నాడు. అత‌డు ఎక్క‌డికి క‌ద‌ల‌లేదు. ఫీల్డ‌ర్ విసిరిన బంతి వికెట్ల‌ను తాక‌కుండా దూరంగా వెళ్లింది.

BCCI : టీమ్ఇండియా హెడ్‌కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షా, స‌చిన్ టెండూల్క‌ర్‌..?

ఇంకోఫీల్డ‌ర్ బాల్ అందుకుని వికెట్ కీప‌ర్ ఎండ్ వైపు ఇచ్చాడు. అప్ప‌టికే అక్క‌డ కీప‌ర్‌తో పాటు దాదాపు ఆరుగురు ఫీల్డ‌ర్లు ఉన్నారు. ఇందులో ఓ చిన్నారి బాల్ ప‌ట్టుకుని వికెట్లును ప‌డ‌గొట్టేందుకు బాల్ విసిరి వేయ‌గా అది వికెట్ల‌ను తాక‌కుండా వెళ్లిపోయింది. ఇంకొఫీల్డ‌ర్ ప‌ట్టుకుని మళ్లీ వికెట్లను కొట్టాల‌ని చూసినా ఆ ప్ర‌య‌త్నం విఫ‌లమైంది. ఆ బాల్ నేరుగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్లను దాటి ముందుకు వెళ్లిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు కూడా ఇద్ద‌రు బ్యాట‌ర్లు నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లోనే ఉన్నారు.

బాల్ ఎప్పుడైతే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ను దాటి వెళ్లిందో షాట్ కొట్టిన బ్యాట‌ర్ వెంట‌నే ప‌రిగెత్తుకుంటూ కీప‌ర్ ఎండ్‌కు వెళ్లిపోయాడు. దీంతో అత‌డు ర‌నౌట్ నుంచి త‌ప్పించుకున్నాడు. అయితే.. వాళ్లు ఒక్క ప‌రుగు కూడా పూర్తి చేయ‌లేక‌పోయారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగింది అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు.

Riyan Parag : నీకు ఇదేం పాడు బుద్ధి నాయ‌నా..! హీరోయిన్ల అందాల కోసం తెగ వెతికిన పరాగ్‌ ?

ట్రెండింగ్ వార్తలు