టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ వీడియో వైరల్.. గంభీర్, కోహ్లీ ఏం చేశారో చూడండి..
టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత శుక్రవారం శ్రీలంక జట్టుతో టీమిండియా తొలి వన్డే ఆడనుంది.
- Harishth Thanniru
- Published On : August 1, 2024 / 01:49 PM IST
Gautam Gambhir
India vs Sri Lanka ODI Series 2024 : శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆగస్టు 2 నుంచి రోహిత్ శర్మ సారథ్యంలో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 2వ తేదీన తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో వన్డే 4వ తేదీన, మూడో వన్డే 7వ తేదీన జరగనుంది. ఈ మూడు మ్యాచ్ లు కొలంబో వేదికగా జరగనున్నాయి. వన్డే మ్యాచ్ లలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లతో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు ఆడబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు.
టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగే తొలి వన్డే మ్యాచ్ ఇదే. దీంతో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా గంభీర్ పక్కనే ఉండి పర్యవేక్షణ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయగా.. కుల్దీప్ యాదవ్, ఇతర బౌలర్లు బౌలింగ్ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలో గంభీర్ దగ్గరుండి వారికి సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించారు.
Also Read : భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. మాజీ క్రికెటర్ కన్నుమూత.. ప్రధాని మోదీసహా జైషా, గంగూలీ సంతాపం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విడివిడిగా గౌతమ్ గంభీర్ తో మాట్లాడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. మొత్తానికి గంభీర్ దగ్గరుండి ప్లేయర్లతో ప్రాక్టీస్ చేయించడం గమనార్హం. అయితే, ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. ఈ వీడియోలో ప్లేయర్స్ తో సరదాగా నవ్వుతూ కనిపించాడు. వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. నెటిజన్లు గంభీర్ ను ఉద్దేశిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
T20I Series ✅
It’s now time for ODIs ??#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG
— BCCI (@BCCI) August 1, 2024
