Ganesh Chaturthi 2023: విఘ్నేశ్వరుడి పూజలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్..

అనుష్క శర్మ ట్వీట్‌కు స్పందిస్తూ నటి కరిష్మా కపూర్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు  అనుష్క పోస్టుకు అభిమానులు స్పందిస్తూ .. విరాట్, అనుష్క జంటకు  వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Virat Kohli - Anushka Sharma

Ganesh Chaturthi 2023 : దేశవ్యాప్తంగా విఘ్నేశ్వరుడి నామస్మరణతో మారుమోగిపోతుంది. గణపతి ఆలయాలు, మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకొని విఘ్నాలు తొలగించాలని.. తలపెట్టిన కార్యక్రమాలను దిగ్విజయం అయ్యేలా చూడమని భక్తులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి, నటి అనుష్క శర్మలు గణేష్ చతుర్థిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Virat Kohli – Anushka Sharma

శుక్రవారం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు వన్డేలకు విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో గణేష్ చతుర్థిని పురస్కరించుకొని కోహ్లీ తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Virat Kohli – Anushka Sharma

ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది. అనుష్క శర్మ ట్వీట్‌కు స్పందిస్తూ నటి కరిష్మా కపూర్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు  అనుష్క పోస్టుకు అభిమానులు స్పందిస్తూ .. విరాట్, అనుష్క జంటకు  వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు