సెక్యూరిటీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. రికార్డుల్లోనే కాదు. అభిమానుల మనస్సుల్లోనూ టాప్ స్థానంలో ఉంటాడు. మైదానంలో హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ బౌండరీలే హద్దుగా చెలరేగిపోతుంటే స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేవాళ్లతో పాటు టీవీల్లో చూసే వాళ్లు సైతం ఊగిపోతుంటారు. అంతగా అభిమానులను సంపాదించుకున్నాడు కోహ్లీ. 
Also Read : బెంగళూరులో డూ ఆర్ డై : రెండో టీ20కి రె‘ఢీ’

అభిమానులతో పాటు జట్టు సహచరులపైనా తనతో పాటు పని చేసే సిబ్బంతిపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరిచే కోహ్లీ .. తనకు సెక్యూరిటీ పర్సనల్‌గా వ్యవహరించే ఫైజల్ బర్త్ డేను దగ్గరుండి జరిపించాడు. కేక్ కట్ చేయించి బహుమతిని అందించాడు. ఆస్ట్రేలియాతో టీ20 ఫార్మాట్ కు ముందు జరిగిన వేడుకల్లో కోహ్లీతో పాటు మరి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. 

చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం టీ20 మ్యాచ్ జరగనున్న క్రమంలో కోహ్లీసేన ఇప్పటికే బెంగళూరు చేరుకుని ప్రాక్టీసు చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో వరల్డ్ కప్ జరగనుండటంతో ఇప్పటికే జట్టును అన్ని విభాగాల్లో సిద్ధం చేసుకున్నాడు కోహ్లీ. తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా అందుకోగా రెండో టీ20 గెలిచి టైగా ముగించాలని భారత్ భావిస్తోంది. 

Also Read : యుద్ధం చేయలేక కాదు: బలహీనులం కాదంటోన్న సచిన్
Also Read : సెక్యూరిటీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన విరాట్ కోహ్లీ