Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఏకైక మొనగాడు.. ఒక్క దెబ్బతో గేల్, కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ రికార్డులు బ్రేక్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) చరిత్ర సృష్టించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 27, 2026 / 08:11 AM IST
Virat Kohli Creates History became first player most consecutive ipl seasons with 600 plus runs (pic credit@rcb)
- ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన ఘనత
- వరుసగా నాలుగు సీజన్లలో 600 ఫ్లస్ రన్స్
- ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు
Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వరుసగా నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 25 బంతులను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 43 పరుగులు సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో 600 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న వెంటనే అతడు జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కోహ్లీ వరుసగా 2023, 2024, 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. వీరంతా వరుసగా మూడు సీజన్ల పాటు 600+ రన్స్ సాధించారు.
వరుసగా అత్యధిక ఐపీఎల్ సీజన్లలో 600+ పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 4 (2023, 2024, 2025, 2026)
* క్రిస్ గేల్ – 3 (2011, 2012, 2013)
* డేవిడ్ వార్నర్ – 3 (2016, 2017, 2019)
* కేఎల్ రాహుల్ – 3 (2020, 2021, 2022)
* డేవిడ్ వార్నర్ – 2 (2017, 2019)
* శుభ్‌మన్ గిల్ – 2 (2025, 2026)
* సాయి సుదర్శన్ – 2 (2025, 2026)
ఇదిలా ఉంటే.. కోహ్లీ ఇప్పటి వరకు 6 సార్లు ఓ ఐపీఎల్ సీజన్‌లో 600 ఫ్లస్ పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగానూ నిలిచాడు. ఆ తరువాత ఈ జాబితాలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. అతడు నాలుగు సార్లు ఓ సీజన్‌లో 600 ఫ్లస్ పరుగులు సాధించాడు.
అత్యధిక సార్లు ఓ సీజన్‌లో 600 ఫ్లస్ పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 6 సార్లు
* కేఎల్ రాహుల్ – 4 సార్లు
* శుభ్‌మన్ గిల్ – 3 సార్లు
* సాయి సుదర్శన్ -2 సార్లు
* ఫాఫ్ డుప్లెసిస్ – 2 సార్లు
* సూర్యకుమార్ యాదవ్ – 2 సార్లు
