Virat Kohli : ఐపీఎల్ 2026కి ముందు ఆర్‌సీబీ ఆట‌గాళ్ల‌కు కోహ్లీ వార్నింగ్‌ .. ఈ సారి చాలా క‌ష్టం.. 120 శాతం..

ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లను విరాట్ కోహ్లీ (Virat Kohli) హెచ్చ‌రించాడు.

Virat Kohli key comments ahead of IPL 2026

  • మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
  • ఈ సీజ‌న్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ ఆట‌గాళ్ల‌కు కోహ్లీ కీల‌క సూచ‌న‌
  • అన్ని జ‌ట్లు బ‌లంగా ఉన్నాయ్‌.. క‌ష్ట‌ప‌డాల్సిందే

Virat Kohli : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభం కానుండ‌గా.. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. వ‌రుస‌గా రెండోసారి కూడా ఆర్‌సీబీ జ‌ట్టు క‌ప్పును ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లను విరాట్ కోహ్లీ హెచ్చ‌రించాడు.

ఈ సారి పోటీ ఇంకా తీవ్రంగా ఉంటుంద‌న్నాడు. కాబ‌ట్టి ఒక్క క్ష‌ణాన్ని కూడా వృథా చేయొద్ద‌ని సూచించాడు. ఇక ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ మాస్ వార్నింగ్‌.. నా దృష్టంతా దానిపైనే.. కాస్కోండి..

ఈ వీడియోలో కోహ్లీ (Virat Kohli) మాట్లాడుతూ.. గ‌త రెండు, మూడు సీజ‌న్లుగా ప్లేయ‌ర్లు అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని అన్నాడు. గతేడాది తాము ఛాంపియ‌న్లుగా నిలిచామ‌ని చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ సారి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంద‌న్నాడు. మిగిలిన జ‌ట్లు కూడా చాలా బ‌లంగా ఉన్నాయ‌న్నాడు.

కాబ‌ట్టి.. మ‌న‌కున్న ఈ త‌క్కువ స‌మ‌యంలో బాగా శ్ర‌మించాల‌న్నాడు. ప్ర‌తి సెష‌న్‌లో కూడా ఒక్క క్ష‌ణాన్ని కూడా వృథా చేయొద్దు అని సూచించాడు. ఈ రెండున్న‌ర నెల‌లు 120 శాతం శ్ర‌మించాల‌న్నాడు. ఇక స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు అంద‌రూ సిద్ధంగా ఉన్న‌ట్లు మిమ్మ‌ల్ని చూస్తే అర్థం అవుతోంద‌ని అన్నాడు.

ODI World Cup 2027 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 కోసం.. 20 మంది పేర్ల‌తో లిస్ట్ రెడీ చేసిన బీసీసీఐ!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్‌సీబీ త‌మ తొలి మ్యాచ్‌ను మార్చి 28న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది.