Virat Kohli : ఆఖరి వన్డే కోసం లండన్ చేరిన భారత్.. ఇంటికెళ్లిపోయిన విరాట్ కోహ్లీ..
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టు బస్సులో హోటల్‌కు చేరుకున్న వెంటనే తన సహచర ఆటగాళ్లతో కలిసి లోపలికి వెళ్లకుండా, బయట వేచి ఉన్న ప్రైవేట్ కారులో వెళ్లిపోయాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 18, 2026 / 03:57 PM IST
Virat Kohli Leaves Team Hotel Separately in London
Virat Kohli : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఈ క్రమంలో ఆఖరిదైన మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు లార్డ్స్‌కు చేరుకున్నాయి. భారత జట్టు లార్డ్స్‌కు చేరుకున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే.. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టు బస్సులో హోటల్‌కు చేరుకున్న వెంటనే తన సహచర ఆటగాళ్లతో కలిసి లోపలికి వెళ్లకుండా, బయట వేచి ఉన్న ప్రైవేట్ కారులో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
PV Sindhu : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
బస్సు హోటల్ వద్ద ఆగిన తరువాత భారత ఆటగాళ్లు.. బస్సు నుంచి దిగి నేరుగా జట్టు హోటల్‌లోకి వెళ్లారు. అయితే కోహ్లీ మాత్రం వారితో కలిసి లాబీలోకి వెళ్లకుండా, బయట సిద్ధంగా ఉన్న ప్రైవేట్ కారులో లండన్‌లోని తన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య, కూతురు, కుమారుడిని చూసేందుకు కోహ్లీ ఇంటికి వెళ్లాడు. మ్యాచ్‌కు ముందు అతడు మళ్లీ జట్టుతో చేరనున్నాడని సమాచారం.
