Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డుకు చేరువలో కోహ్లీ.. రాజస్థాన్ అడ్డుకోగలదా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2024 సీజన్ లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ..

IPL 2024 RCB vs RR Eliminator Match : ఐపీఎల్ 2024 చివరి అంకానికి వచ్చేసింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ పూర్తయింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ జట్టుపై కేకేఆర్ జట్టు విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ -2కు చేరుకుంటుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత కీలకమైన ఫీట్ ను సాధించేందుకు అవకాశం ఉంది. విరాట్ సరికొత్త రికార్డును నమోదు చేస్తారా? రాజస్థాన్ జట్టు అడ్డుకుంటుందా అనేది ఉత్కంఠభరితంగా మారింది.

Also Read : IPL 2024 : ఎస్ఆర్‌హెచ్‌ ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఇవే.. మార్చుకోకుంటే ఫైన‌ల్‌కు చేరడం కష్టమే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2024 సీజన్ లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. 64.36 సగటుతో, 155.60 స్ట్రైక్ రేట్ తో 708 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో కోహ్లీ ఉన్నాడు. అయితే, అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసేందుకు అవకాశం ఉంది. కోహ్లీ ఐపీఎల్ కెరీర్ లో 7,971 పరుగులు చేశాడు. ఇవాళ రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో మరో 29 పరుగులు చేస్తే 8వేల పరుగుల మైలురాయిని కోహ్లీ చేరుకుంటాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 8వేల పరుగులు దాటిన తొలి బ్యాటర్ గా కోహ్లీ రికార్డుకెక్కనున్నాడు.

Also Read : SRH vs KKR IPL 2024 : క్వాలిఫయర్‌-1లో హైదరాబాద్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కోల్‌కతా

కోహ్లీ ఐపీఎల్ కెరీర్ లో 251 మ్యాచ్ లు ఆడగా.. అందులో ఎనిమిది సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 7971 పరుగులు చేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ ఆడుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టు తరపున 250కిపైగా మ్యాచ్ లు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే, ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోపీని గెలుచుకోలేదు. ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోపీని గెలుస్తుందని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు