IND vs PAK : పాకిస్థాన్‌పై భారత్ విజయం.. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్.. ఈ విజయం వారికి అంకితం..
IND vs PAK : పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విజయం భారత అభిమానుల కోసమేనని అన్నారు.
Suryakumar Yadav
- పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం
- 61 పరుగుల తేడాతో్ విజయం సాధించిన భారత్
- ఈ విజయం భారత అభిమానుల కోసమేనన్న సూర్యకుమార్ యాదవ్
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 175 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో పాకిస్థాన్ జట్టు విఫలమైంది. 18ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : IND vs PAK : మా ఓటమికి కారణం అదే.. వారి వల్లే ఇలా జరిగింది.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా సంచలన కామెంట్స్
జట్టు ప్రదర్శనపై సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించామని అన్నారు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడిన సూర్య.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని ప్రశంసించాడు. ఈ విజయం భారత్ అభిమానుల కోసమేనని అన్నారు.
మేము ఎలాంటి బ్రాండ్ క్రికెట్‌ను ఆడాలని భావించామో అదే ఆటను ప్రదర్శించాం. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మంచి ఆప్షనే. ఇషాన్ కిషాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సున్నాకే వికెట్ పడినప్పుడు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. బాధ్యత తీసుకోవటం బాగుంది.
సాధారణంగా తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత లక్ష్యం సరిపోతుందో అంచనా వేయడం కష్టం. అయితే, ఇక్కడ 155 కంటే ఎక్కువ స్కోరు ఉంటే మంచి లక్ష్యమే అవుతుందని మేము అనుకున్నాం. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. బంతితో ప్రతిఒక్కరూ కంట్రిబ్యూట్ చేశారు. అహ్మదాబాద్ మ్యాచ్‌కు సిద్ధమయ్యేందుకు భారత్‌కు తిరిగి వెళ్లిపోతున్నాం అని సూర్య కుమార్ అన్నారు.
“THIS IS FOR INDIA” – Suryakumar Yadav after beating Pakistan in T20 WC. 🥶 pic.twitter.com/kUSXYHn22z
— Johns. (@CricCrazyJohns) February 15, 2026
