Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఓ ఫార్మాట్‌లో అత్యధిక శతకాల కింగ్ కోహ్లీనే.. సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- November 30, 2025 / 04:33 PM IST
Virat Kohli now has most individual hundreds in a single format
Virat Kohli : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. రాంచి వేదికగా దక్షిణాఫికాతో తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli) శతకంతో చెలరేగాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 102 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 52వ శతకం కావడం విశేషం.
ఈ క్రమంలో కోహ్లీ టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ తన టెస్టు కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడాడు. 53.8 సగటుతో 15921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో సిక్సర్ల కింగ్ హిట్‌మ్యానే..
ఇక విరాట్ విషయానికి వస్తే.. తాజా మ్యాచ్‌తో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 306 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 293 ఇన్నింగ్స్‌ల్లో 57.7 సగటుతో 14255 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 75 అర్థశతకాలు ఉన్నాయి.
ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లీ (భారత్) – 52 శతకాలు (వన్డేల్లో)
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 51 శతకాలు (టెస్టుల్లో)
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 49 శతకాలు (వన్డేల్లో)
* జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 45 శతకాలు (టెస్టుల్లో)
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 41 శతకాలు (టెస్టుల్లో)
IND vs SA : రాంచిలో చరిత్ర సృష్టించిన రోహిత్-కోహ్లీ.. సచిన్, ద్రవిడ్ రికార్డ్ బ్రేక్
సౌతాఫ్రికాపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు
దక్షిణాఫ్రికా పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్‌లను అధిగమించాడు. వార్నర్, సచిన్‌లు దక్షిణాఫ్రికాపై వన్డేల్లో చెరో ఐదు సెంచరీలు చేయగా.. రాంచితో మ్యాచ్‌లో సెంచరీ సౌతాఫ్రికాపై కోహ్లీకి ఆరోది.
వన్డేల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 6 సెంచరీలు
* సచిన్ టెండూల్కర్ – 5 సెంచరీలు
* డేవిడ్ వార్నర్ – 5 సెంచరీలు.
