Virat Kohli : పుట్టిన రోజు నాడు హాఫ్ సెంచరీలు చేసిన టీమ్ఇండియా ప్లేయర్లు ఎవరో తెలుసా..?
పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అలాంటి రోజును మెమరబుల్‌గా మార్చుకోవాలని చాలా మంది బావిస్తుంటారు.
- Thota Vamshi Kumar
- Published on- November 5, 2023 / 04:28 PM IST
Virat Kohli
Virat Kohli birthday : పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అలాంటి రోజును మెమరబుల్‌గా మార్చుకోవాలని చాలా మంది బావిస్తుంటారు. ఇక క్రికెటర్లు అయితే.. తమ పుట్టిన రోజున శతకం లేదా అర్ధశతకం చేయాలని కోరుకుంటారు. కాగా.. నేడు నవంబర్ 5 భారత పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధశతకాన్ని సాధించాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 67 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇది 71వ అర్దశతకం.
ఇలా పుట్టిన రోజు నాడు హాప్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
సచిన్ టెండూల్కర్ – 134 ఆస్ట్రేలియాపై షార్జాలో 1998 (25వ పుట్టిన రోజున)
వినోద్ కాంబ్లీ 100* – ఇంగ్లాండ్‌పై జైపూర్‌లో 1993 (21వ పుట్టిన రోజున)
నవ్యజ్యోతి సింగ్ సిద్ధూ 65* – వెస్టిండీస్ పై ముంబైలో 1994 (31 వ పుట్టిన రోజున)
ఇషాన్ కిషన్ 59 – శ్రీలంక పై కొలంబోలో 2021 (23వ పుట్టిన రోజున)
యూసప్ పఠాన్ 50* – ఇంగ్లాండ్ పై ఇండోర్‌లో 2008 (26వ పుట్టిన రోజున)
విరాట్ కోహ్లీ 50* – దక్షిణాఫ్రికా పై కోల్‌కతాలో 2023 (35వ పుట్టిన రోజున)
NZ vs PAK : ఒక్క సెంచరీతో హీరో.. రివార్డు ప్రకటించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 30 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కోహ్లీ (54), శ్రేయస్ అయ్యర్ (47) లు ఆడుతున్నారు.
