నెం.1 కెప్టెన్: ధోనీ మరో రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

సోమవారం జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన కోహ్లీ టెస్టుల్లో నెం.1కెప్టెన్‌గా ఘనత సాధించాడు. బ్యాట్స్‌మెన్‌‌గా దశాబ్దాల నాటి రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న కోహ్లీ కెప్టెన్‌గానూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. భారత్ తరపును టెస్టు క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన కెప్టెన్లలో కోహ్లీ నెం.1గా నిలిచాడు.

గతంలో ధోనీ కెప్టెన్‌గా 60టెస్టులు ఆడి 27గెలవగా,  కోహ్లీ 48టెస్టుల్లోనే 28విజయాలు సాధించి ఆ రికార్డును దాటేశాడు. దీంతో అత్యంత త్వరంగా టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్‌‌గా రికార్డులకెక్కాడు. 

ధోనీ కెప్టెన్సీలో 60 టెస్టులకి 27 గెలిచి.. 18 ఓడి, 15 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇక కోహ్లీ కెప్టెన్సీలో 48 టెస్టులాడి 28 విజయాలు, 10 ఓటముల, 10 డ్రాలతో నిలిచింది. ధోనీ కెప్టెన్సీలో భారత్ 45% విజయాల్ని నమోదు చేస్తే… కోహ్లీ కెప్టెన్సీలో 58.33% గెలుపొందడం విశేషం. 

టెస్టుల్లో భారత్‌కు విజయాల్ని తెచ్చిపెట్టిన టీమిండియా కెప్టెన్ల వివరాలిలా ఉన్నాయి. విరాట్ కోహ్లి (28), మహేంద్రసింగ్ ధోని (27), సౌరవ్ గంగూలీ (21), మొహ్మద్ అజహరుద్దీన్ (14), సునీల్ గవాస్కర్ (9), పటౌడి (7) లు ఉన్నారు. కొనసాగుతున్నారు.