Virat Kohli: వచ్చే సీజన్‌కు మరింత బలంగా తిరిగొస్తాం.. ఆర్‌సీబీ ఓటమిపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ ..
ఆర్సీబీ జట్టు ప్లేయర్స్‌తో కూడిన రెండు ఫొటోలు, బెంగళూరు స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫొటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ షేర్ చేశాడు.
- Harishth Thanniru
- Published On : May 23, 2023 / 02:25 PM IST
Virat Kohli
IPL 2023 : ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరింది. నాలుగు జట్లు ప్లే ఆప్స్ కు చేరాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ అవకాశాలను తృటిలో చేజార్చుకుంది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడగా.. కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 60 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. అయినా ఆ జట్టు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ మంగళవారం తన ఇన్ స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
IPL 2023: ధోనీ సేనకు శుభ్‌మన్ గిల్ స్వీట్ వార్నింగ్..
ఆర్సీబీ జట్టు ప్లేయర్స్‌తో కూడిన రెండు ఫొటోలు, బెంగళూరు స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫొటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ ఫొటోలపై థాంక్యూ బెంగళూరు అని రాశారు. ఈ సీజన్ మెరుగ్గా రాణించినప్పటికీ.. దురదృష్టవశాత్తూ మేము లక్ష్యాన్ని చేరుకోలేక పోయాము. నిరాశ చెందినప్పటికీ మనం తలెత్తుకునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు అడుగడుగునా అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. కోచ్ లు, మేనేజ్ మెంట్, నా సహచరులకు ధన్యవాదాలు. మేము బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.
2023 ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆర్సీబీ తరపున 14 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి.
