Sunil Gavaskar Dance: టీమిండియా మ్యాచ్ గెలిచాక సునీల్ గవాస్కర్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇటీవల చేసిన డ్యాన్స్ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులో గెలిచిన వెంటనే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేశారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్తో కలిసి మాట్లాడుతున్న సమయంలో సునీల్ గవాస్కర్ కుర్చీలో నుంచే చేతులు, కాళ్లు కదిలిస్తూ డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.
- T Venkateshwarlu
- Updated on- September 27, 2022 / 09:04 AM IST
Sunil Gavaskar Dance: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇటీవల చేసిన డ్యాన్స్ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులో గెలిచిన వెంటనే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేశారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్తో కలిసి మాట్లాడుతున్న సమయంలో సునీల్ గవాస్కర్ కుర్చీలో నుంచే చేతులు, కాళ్లు కదిలిస్తూ డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.
మరోవైపు, టీమిండియా గెలవగానే క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అంబరాన్నంటేలా ఆనందం వ్యక్తం చేశారు. భారత్ చేతిలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన వెంటనే చప్పట్లు కొడుతూ, రోహిత్ శర్మ తొడపై కొడుతూ విరాట్ కోహ్లీ అమితానందాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం కోహ్లీని రోహిత్ శర్మ హత్తుకున్నాడు. ఆ సమయంలో వారిద్దరు డ్రెస్సింగ్ రూమ్ వద్ద మెట్లపై కూర్చున్నారు. ఉత్సాహంతో వారిద్దరు సంబంరం చేసుకున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఆసీస్ నిర్దేశించిన 187 లక్ష్యాన్ని భారత బ్యాట్స్ మెన్ 19.5 ఓవర్లలో ఛేదించారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 63 పరుగులు చేయగా, సూర్య కుమార్ యాదవ్ 69 పరుగులు చేశాడు. వారిద్దరు బాగా రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. భారత ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ సాధించిన ఈ విజయం టీమిండియాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Rains in Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లపై నీళ్లు నిలిచిన వైనం
