Rohit-Virat kohli : వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ ముగిసింది.. కోహ్లీ, రోహిత్‌ల‌ను మ‌ళ్లీ భార‌త జెర్సీలో ఎప్పుడు చూడొచ్చంటే?

Rohit-Virat kohli : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి కేవ‌లం వ‌న్డేల‌ను మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.

West Indiaes ODI series complete do you know when will kohli rohit play for team india

Rohit-Virat kohli : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి కేవ‌లం వ‌న్డేల‌ను మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 సాధించ‌డ‌మే ల‌క్ష్యమ‌ని వీరిద్ద‌రు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు.

ఇక వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను భార‌త్ 2-1తో కైవ‌సం చేసుకుంది. సిరీస్ విజ‌యంలో కోహ్లీ, రోహిత్ లు త‌మ వంతు పాత్ర పోషించారు. ఇక వ‌న్డే సిరీస్‌ ముగియ‌డంతో మ‌రోసారి వీరిద్ద‌రి భారత జెర్సీలో ఎప్పుడు చూడొచ్చు అన్నదానిపై ఆస‌క్తి ఉంది.

అక్టోబ‌ర్ 6 నుంచి భార‌త జ‌ట్టు వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌రువాత న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. అక్క‌డ టీ20, వ‌న్డే, టెస్టు సిరీస్‌లు ఆడ‌నుంది. తొలుత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ అక్టోబ‌ర్ 22 నుంచి న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఆత‌రువాత 5 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. న‌వంబ‌ర్ 4 నుంచి 15 వ‌ర‌కు వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. కోహ్లీ, రోహిత్‌లు మ‌ళ్లీ ఈ సిరీస్‌లోనూ చూడొచ్చు.

Shai Hope : ధోని స‌ల‌హాతోనే భార‌త్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీల‌క కామెంట్స్‌..

న్యూజిలాండ్ ప‌ర్య‌న‌కు కోహ్లీ, రోహిత్‌లు ఎంపిక అయితే స‌రిగ్గా నెల రోజుల త‌రువాత వీరిద్ద‌రిని భార‌త జెర్సీలో చూడొచ్చు. ఇక కివీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ న‌వంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది.