CPL 2023 : మనకెందుకు భయ్యా.. ఇలాంటి రిస్క్ షాట్లు.. ఏదైన జరిగుంటే..?
సాధారణంగా టెస్టుల్లో, వన్డేల్లో సాంప్రదాయ షాట్లు ఆడేందుకే ఎక్కువగా బ్యాటర్లు ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ సందర్భాల్లోనే ప్రయోగాల జోలికి వెళ్లేవారు. ఎప్పుడైతే టీ20 క్రికెట్ ప్రారంభం అయ్యిందో అప్పటి నుంచి బ్యాటర్లు రకరకాలు షాట్లు ఆడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 28, 2023 / 03:14 PM IST
Johnson Charles
CPL 2023-Charles : సాధారణంగా టెస్టుల్లో, వన్డేల్లో సాంప్రదాయ షాట్లు ఆడేందుకే ఎక్కువగా బ్యాటర్లు ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ సందర్భాల్లోనే ప్రయోగాల జోలికి వెళ్లేవారు. ఎప్పుడైతే టీ20 క్రికెట్ ప్రారంభం అయ్యిందో అప్పటి నుంచి బ్యాటర్లు రకరకాలు షాట్లు ఆడుతున్నారు. బంతిని బౌండరీకి తరలించేందుకు శరీరాన్ని విల్లులా వంచుతున్నారు. అయితే.. కొన్ని సార్లు ఇలాంటి షాట్లు ఆడడంలో విఫలం అయి గాయాల పాలు అయిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ చార్లెస్ (Charles) తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
చార్లెస్ కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో సెయింట్ లూసియా కింగ్స్ తరుపున ఆడుతున్నాడు. ట్రింబాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చార్లెస్ తన శైలికి భిన్నంగా విభిన్న షాట్ (స్కూప్) ఆడేందుకు యత్నించాడు. అయితే.. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ను తాకకుండా అతడి హెల్మెట్‌ను తాకింది. దెబ్బకు హెల్మెట్ ఎగిరి కిందపడింది. ఎక్కడ హెల్మెట్ వికెట్ల పై పడుతుందో అని బావించిన చార్లెస్ హెల్మెట్ కిందపడే సమయంలో కాలితో దాన్ని తన్నాడు. అదృష్ట వశాత్తు వికెట్ల పై పడలేదు. వెంటనే ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.
Asia Cup 2023: ఆసియా కప్‌లో పాక్ వర్సెస్ భారత్ మ్యాచ్‌పై బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు
బంతి చార్లెస్ హెల్మెట్‌ను తాకడంతో అతడికి ఎమైన అయ్యిందేమోనని అభిమానులు కంగారు పడ్డారు. అయితే.. అతడికి ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు స్పందిస్తున్నారు. మనకెందుకు భయ్యా.. ఇలాంటి షాట్లు.. రిస్క్ అవసరమా..? కొంచెం గట్టిగా తగిలి ఉంటే ఏమి అయ్యేది అంటూ ..? కామెంట్లు పెడుతున్నారు.
