West Indies : సిక్స‌ర్ల‌లో వెస్టిండీస్ స‌రికొత్త రికార్డు.. ఆ వెనుకే భార‌త్‌..

టీ20 క్రికెట్‌లో సిక్స‌ర్ల‌ను కొట్ట‌డంలో వెస్టిండీస్ ఆట‌గాళ్ల‌ను (West Indies) మించిన వారు లేరు అన‌డంలో అతిశ‌యోక్తి కాదేమో.

West Indies Create History With 2000 T20 Sixes India Closing This Milestone

West Indies : టీ20 క్రికెట్‌లో సిక్స‌ర్ల‌ను కొట్ట‌డంలో వెస్టిండీస్ ఆట‌గాళ్ల‌ను మించిన వారు లేరు అన‌డంలో అతిశ‌యోక్తి కాదేమో. ఈ క్ర‌మంలో వెస్టిండీస్ జ‌ట్టు అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2 వేల సిక్స‌ర్ల క్ల‌బ్‌లో ఆ జ‌ట్టు అడుగుపెట్టింది. ఆదివారం ఇండోర్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మూడో టీ20మ్యాచ్‌లో విండీస్ ఈ మైలురాయిని చేరుకుంది.

ఈ మ్యాచ్‌కు ముందు విండీస్ జ‌ట్టు 2వేల సిక్స‌ర్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు 3 సిక్స‌ర్లు అవ‌స‌రం. ఇక మ్యాచ్‌లో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు మొత్తం 13 సిక్స‌ర్లు బాద‌డంతో విండీస్ సిక్స‌ర్ల సంఖ్య 2010కి చేరింది. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2000 సిక్స‌ర్లు సాధించిన తొలి జ‌ట్టుగా వెస్టిండీస్ చ‌రిత్ర సృష్టించింది.

ఇక భార‌త జ‌ట్టు విష‌యానికి వస్తే.. టీమ్ఇండియా నిన్న‌టి మ్యాచ్‌తో క‌లుపుకుని ఇప్ప‌టి వ‌ర‌కు 1997 సిక్స‌ర్లు బాదింది. 2వేల సిక్స‌ర్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు మ‌రో మూడు సిక్స‌ర్లు మాత్ర‌మే అవ‌స‌రం. బుధ‌వారం (అక్టోబ‌ర్ 14న‌) హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు 2వేల సిక్స‌ర్ల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌డం దాదాపుగా ఖాయ‌మే. ఈ క్ర‌మంలో 2వేల సిక్స‌ర్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన రెండో జ‌ట్టుగా భార‌త్ నిల‌వ‌నుంది.

న్యూజిలాండ్ 1,585 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండ‌గా.. పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జ‌ట్లు ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జట్లు ఇవే..

* వెస్టిండీస్ – 2010 సిక్స‌ర్లు
* భార‌త్ – 1997 సిక్స‌ర్లు
* న్యూజిలాండ్ – 1585 సిక్స‌ర్లు
* పాకిస్థాన్ – 1500 సిక్స‌ర్లు
* సౌతాఫ్రికా – 1407 సిక్స‌ర్లు
* ఇంగ్లాండ్ – 1406సిక్స‌ర్లు