Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ బలహీనత ఏమిటి? వెస్టిండీస్ దిగ్గ‌జం ఇయాన్ బిషప్ ఏమ‌న్నాడంటే ?

ఐపీఎల్ 2026 లో వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi ) అద‌ర‌గొడుతున్నాడు. బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ ఓపెన‌ర్‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ కు శుభారంభాల‌ను అందిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

What is Vaibhav Sooryavanshi Weakness Ian Bishop Gives Clear Verdict (pic credit@ipl)

  • భీక‌ర ఫామ్‌లో వైభ‌వ్ సూర్యవంశీ
  • బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం చెలాయిస్తూ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు
  • అత‌డి బల‌హీన‌ల‌పై ఏంటో తెలుసుకునేందుకు బౌల‌ర్ల విఫ‌ల‌య‌త్నాలు
  • ఇషాన్ బిష‌న్ షాకింగ్ కామెంట్లు

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 లో వైభ‌వ్ సూర్య‌వంశీ అద‌ర‌గొడుతున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ 15 ఏళ్ల యువ ఆట‌గాడు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ ఓపెన‌ర్‌గా జ‌ట్టుకు శుభారంభాల‌ను అందిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అత‌డు 400 ప‌రుగులు సాధించాడు. అత‌డిని ఎలా ఔట్ చేయాల‌నే దానిపై బౌల‌ర్లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. తాజాగా దీనిపై వెస్టిండీస్ మాజీ పేస‌ర్ ఇయాన్ బిష‌ప్‌ స్పందించాడు.

Kumar Sangakkara : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర‌.. రియాన్ ప‌రాగ్ వేపింగ్ పై.. జ‌ట్టు సంస్కృతి..

కొంతమంది బౌలర్లు బ్యాక్ ఆఫ్ ఎ లెంగ్త్ బంతులతో తనను బోల్తా కొట్టించగలిగినప్పటికీ, అదే వ్యూహం చాలాసార్లు విఫలమైందని బిషప్ తెలిపాడు.

‘సాంకేతికంగా అతను బేస్‌బాల్ తరహాలో బ్యాట్ స్వింగ్ చేస్తూ ఉంటాడు. అతని బలహీనత ఏమిటో కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. బ్యాక్ ఆఫ్ ఎ లెంగ్త్ బంతులు అతనికి బాగా పనిచేశాయి. కానీ బంతికి టాప్ ఎడ్జ్ తీసుకోక‌పోతే అవి మైదానం బయ‌ట ఉంటాయి. ఖ‌చ్చితంగా అతని బలహీనత ఇది అని మాత్రం చెప్ప‌డం క‌ష్టం.’ అని ఇయాన్ బిష‌ప్ అన్నారు.

Jason Holder : ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ క్యాచ్ ఔట్ పై వివాదం.. ఆ క్యాచ్ అందుకున్న జేస‌న్ హోల్డ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఈ సీజ‌న్‌లో 400 ప‌రుగులు దాటిన తొలి ప్లేయ‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ప్ర‌స్తుతం అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శ‌ర్మ (425), హెన్రిచ్ క్లాసెన్ (414) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.