IND vs NZ : భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ నేడే.. జియోలో రాదు.. ఎక్కడ చూడొచ్చంటే?
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- October 22, 2026 / 08:42 AM IST
When and where to watch IND vs NZ 1st T20 match
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా నేడు తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతుండగా, మిచెల్ సాంట్నర్ నాయకత్వంలో కివీస్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గెలుపుతో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత భారత జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పైనే అందరి దృష్టి నిలవనుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే కివీస్ గడ్డపై అతడు ఎలా రాణిస్తాడనే దానిపై అందరిలో ఆసక్తి ఉంది.
భారత్, కివీస్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబర్ 22న – క్రైస్ట్‌చర్చ్
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 24న – క్రైస్ట్‌చర్చ్
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 27న – వెల్లింగ్టన్
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 30న – ఆక్లాండ్
* ఐదో టీ20 మ్యాచ్ – నవంబర్ 1న – హామిల్టన్
మ్యాచ్‌లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఈ సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువన్వేశర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే..
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, బెవాన్ జాకబ్స్, ఆడమ్ మిల్నే, బ్లెయిర్ టిక్నర్.
జియోలో రాదు.. ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లోని మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లో రావు. ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే.. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
