IND vs NZ : బుధవారం నుంచి భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జియోలో రాదు మరి ఎక్కడ చూడొచ్చంటే?
నవంబర్ 4 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల (IND vs NZ) వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 1, 2026 / 05:21 PM IST
When and Where to watch IND vs NZ 5 match ODI Series
IND vs NZ : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్ పై పడింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 4 (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ రావడంతో భారత బలం మరింత పెరిగింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌లోనూ విజయం సాధించాలని భారత్ భావిస్తోంది.
మరోవైపు టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ ఆరాటపడుతోంది. ఈక్రమంలో వన్డే సిరీస్ సైతం హోరాహోరీగా సాగనుంది. అదే సమయంలో ఇరు జట్లు కూడా వన్డే ప్రపంచకప్ 2027కు ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కూర్పు విషయంలో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.
వన్డే సిరీస్ షెడ్యూల్..
* తొలి వన్డే – నవంబర్ 4న (ఆక్లాండ్ )
* రెండో వన్డే – నవంబర్ 7న (వెల్లింగ్టన్)
* మూడో వన్డే – నవంబర్ 10న (హామిల్టన్)
* నాలుగో వన్డే – నవంబర్ 13న (మౌంట్ మౌంగనుయి)
* ఐదో వన్డే – నవంబర్ 15న (మౌంట్ మౌంగనుయి)
Shreyas Iyer : ఆ ఒక్క తప్పు వల్లనే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్..
మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
న్యూజిలాండ్‌తో జరిగే మొదటి మూడు వన్డేల కోసం భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి(తొలి వన్డేకు మాత్రమే), ఆకిబ్ నబీ,
న్యూజిలాండ్‌తో 4,5 వన్డే మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, యష్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్
ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జియో హాట్‌స్టార్‌లో రాదు. ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో అయితే.. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
