Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్యవంశీ కోసం వేలంలో ఫస్ట్ బిడ్ వేసింది రాజ‌స్థాన్ కాదా.. ఏ జ‌ట్టు అంటే..?

వేలంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వైభ‌వ్ సూర్య‌వంశీని (Vaibhav Suryavanshi) కోటీ 10 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది.

Which team was first bid for vaibhav sooryavanshi in ipl 2025 auction

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య వంశీ అద‌ర‌గొడుతున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత‌డు ఆ జ‌ట్టుకు మెరుపు ఆరంభాల‌ను అందిస్తూ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడ‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. ఇక ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ వైభ‌వ్ అద‌ర‌గొట్టాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో కేవ‌లం 17 బంతుల్లో 52 ప‌రుగులు చేయ‌గా.. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 31 ప‌రుగులు సాధించాడు. ఇక మంగ‌ళ‌వారం గౌహ‌తి వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 14 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స‌ర్ల సాయంతో 39 ప‌రుగులు చేశాడు.

వైభ‌వ్ కోసం తొలి బిడ్ వేసింది ఎవ‌రంటే?

వైభ‌వ్ సూర్య‌వంశీని ఐపీఎల్ 2025 మెగావేలంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ 1.1 కోట్ల‌కు సొంతం చేసుకుంది. అయితే.. వేలంలో అత‌డి పేరును పిలిచిన‌ప్పుడు తొలుత రాజ‌స్థాన్ అత‌డి కోసం బిడ్ వేయ‌లేదు.

వైభ‌వ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన హార్దిక్ పాండ్యా.. నువ్వు గొప్పొడివి సామీ..

ఐపీఎల్ 2025 మెగావేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో జ‌రిగింది. ఈ వేలం కోసం 574 మంది ఆట‌గాళ్ల‌ను షార్ట్ లిస్ట్ చేయ‌గా ఇందులో 13 ఏళ్ల వైభ‌వ్ సూర్య వంశీ పేరు 491వ స్థానంలో ఉంది. 30 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో అత‌డు వేలంలోకి వ‌చ్చాడు. తొలుత అత‌డి కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్ బిడ్ దాఖ‌లు చేసింది. ఆ త‌రువాత రాజ‌స్థాన్  బిడ్ వేసింది.

వైభ‌వ్ కోసం ఢిల్లీ, రాజ‌స్థాన్ లు పోటీ ప‌డ‌డంతో అత‌డి ధ‌ర అమాంతం పెరిగిపోయింది. వైభ‌వ్ సూర్య‌వంశీపై కోటీ వ‌ర‌కు ఢిల్లీ బిడ్ దాఖ‌లు చేసింది. ఆ స‌మ‌యంలో రాజ‌స్థాన్ కోటీ 10ల‌క్ష‌ల‌కు బిడ్ దాఖ‌లు చేసింది. ఢిల్లీ వెన‌క్కి త‌గ్గ‌డంతో అదే ధ‌ర‌కు వైభ‌వ్ రాజ‌స్థాన్ సొంతం అయ్యాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వ‌య‌స్కుడైన ఆట‌గాడిగా వైభ‌వ్ చ‌రిత్ర సృష్టించాడు.

అదే మా కొంప ముంచింది.. బ్యాట‌ర్ల త‌ప్పేం లేదు.. హార్దిక్ పాండ్యా కీల‌క వ్యాఖ్య‌లు..

ఐపీఎల్ 2025 ప్రారంభ స‌మ‌యానికి అత‌డికి 14 ఏళ్లు నిండాయి. ఐపీఎల్‌లో తాను ఆడిన తొలి బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఇక ఇదే సీజ‌న్‌లో సెంచ‌రీ చేసి ఐపీఎల్‌లో శ‌త‌కం సాధించిన పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పెను విధ్వంసాల‌ను సృష్టిస్తున్నాడు.