Kal Somani : ఎవరు బ్రో నువ్వు 15వేల కోట్లు పెట్టి కొన్నావ్.. RR కొత్త ఓనర్ బయోగ్రఫీ..

ఐపీఎల్‌లోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపార‌వేత్త క‌ల్ సోమానీ (Kal Somani ) నేతృత్వంలోని క‌న్సార్షియం కొనుగోలు చేసింది.

Who is Kal Somani the new owner of the Rajasthan Royals

  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంఛైజీని కొన్న క‌ల్‌సోమానీ
  • భార‌త క‌రెన్సీలో సుమారు రూ.15,300 కోట్లకు

Kal Somani : ఐపీఎల్‌లోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపార‌వేత్త క‌ల్ సోమానీ నేతృత్వంలోని క‌న్సార్షియం కొనుగోలు చేసింది. 1.63 బిలియ‌న్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.15,300 కోట్ల‌కు 100 శాతం వాటాను ద‌క్కించుకుంది. సోమ‌నితో పాటు రిటైల్ దిగ్గ‌జం వాల్‌మార్ట్‌కు చెందిన రాబ్ వాల్ట‌న్‌, ఫోర్ట్ మోట‌ర్ కంపెనీ య‌జ‌మాని హాంప్ కుటుంబం క‌న్సార్షియంలో స‌భ్యులుగా ఉన్నారు. ఇక ఈ ఒప్పందానికి బీసీసీఐతో పాటు కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

ఎవరీ కల్ సోమానీ?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంఛైజీని ద‌క్కించుకోవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి క‌ల్ సోమానీ పై ప‌డింది. సోమానీ అరిజోనాలోని స్కాట్స్‌డేల్‌లో నివసిస్తున్నారు. ఆర్టిఫియ‌ష‌న్ ఇంటెలిజెన్స్‌, ఎడ్‌-టెక్, డేలా ప్రైవ‌సీ వంటి రంగాల్లో ఆయ‌న‌కు 15 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ‘ఇంట్రాఎడ్జ్’, ‘ట్రూయో’, ‘ట్రూయో.ఏఐ’ వంటి విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలను ఆయన స్థాపించారు.

Piyush Chawla : కొడుకు బ‌ర్త్ డే.. 9 ఏళ్ల జ్ఞాప‌కాల‌ను పోస్ట్ చేసిన మాజీ క్రికెట‌ర్ పీయూష్ చావ్లా

ఆయ‌న‌కు క్రికెట్‌తో పాటు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న మోటార్ సిటీ గోల్ఫ్ క్ల‌బ్‌కు స‌హ య‌జ‌మానిగా ఉన్నారు. ఈక్ల‌బ్‌కు గోల్ఫ్ దిగ్గ‌జం టైగ‌ర్ వుడ్స్‌తో అనుబంధం ఉంది. ఆయన TMRW స్పోర్ట్స్, TGL గోల్ఫ్ లీగ్‌లో తొలి పెట్టుబడిదారులలో ఒకరు కూడా.

ఆర్ఆర్‌తో బంధం కొత్త‌ది కాదు..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో సోమానీ బంధం కొత్త‌ది ఏమీ కాదు. 2021లోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంఛైజీలో ఆయ‌న పెట్టుబ‌డులు పెట్టారు. ఆ స‌మ‌యంలోనే ఐపీఎల్ భ‌విష్య‌త్ వృద్ధిపై ఆయ‌న బ‌ల‌మైన విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.