Rohit Sharma : నా కండలు చూశావా..? అంపైర్‌తో రోహిత్ శర్మ.. వీడియో వైరల్
టీమ్ ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ ఆ తరువాత జరిగిన మ్యాచుల్లో ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 15, 2023 / 04:22 PM IST
Rohit Sharma
Rohit Sharma-Marais Erasmus : టీమ్ ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ ఆ తరువాత జరిగిన మ్యాచుల్లో ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో శతకంతో చెలరేగిన రోహిత్.. శనివారం అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేసి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్ శర్మ..
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. అంపైర్‌కు రోహిత్ శర్మ తన కండలు చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ వివరణ ఇచ్చాడు. అందుకు గల కారణాన్ని వెల్లడించాడు.
ODI World Cup 2023 : శ్రీలంకకు భారీ షాక్.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు..
భారత ఇన్నింగ్స్ 15 ఓవర్‌ను పాక్ పేసర్ హ్యారీస్ రవూఫ్ వేశాడు. 141.1 కి.మీ వేగంతో మొదటి బంతిని వేశాడు. అయితే.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన పుల్ షాట్‌తో బంతిని సిక్స్‌గా మలిచాడు. రోహిత్ కొట్టిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మైదానంలో ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరైస్ ఎరాస్మస్ సైతం ఆశ్చర్యపోయాడు.
రోహిత్ దగ్గరకు వెళ్లిన ఎరాస్మస్.. ‘నువ్వు ఇంత సింపుల్‌గా సిక్సులు ఎలా కొడతావు. నీ బ్యాట్‌లో ఏదైన ఉందా..?’ అని అడిగాడు. ఇందుకు రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు. అది తన బ్యాట్ పవర్ కాదని, తన మజిల్ పవర్ అని చెబుతూ అతడికి తన కండలు చూపించాడు.
అంపైర్‌కు కండలు ఎందుకు చూపించావు అని మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య అడుగగా.. జరిగిన విషయాన్ని రోహిత్ చెప్పాడు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
