ODI World Cup 2023 : భారత్‌తో మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఎందుకు ఆడడం లేడు..? కారణం అదేనా..? ఇంకేమైనా ఉందా..?
పూణె వేదికగా టీమ్ఇండియాతో బంగ్లాదేశ్ తలపడుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆడడం లేదు.
- Thota Vamshi Kumar
- Published On : October 19, 2023 / 04:49 PM IST
Shakib Al Hasan
ODI World Cup : వన్డే ప్రపంచకప్‌లో భారత్ పుల్ జోష్‌లో ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించింది. ఈ క్రమంలో నాలుగో విజయం పై కన్నేసింది. అటు బంగ్లాదేశ్ పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. మొదటి మ్యాచులో గెలిచిన బంగ్లాదేశ్ మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడింది. ఈ క్రమంలో పూణె వేదికగా టీమ్ఇండియాతో తలపడుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆడడం లేదు. కెప్టెన్ గైర్హాజరీలో నజ్ముల్ హోసన్ శాంటో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.
షకీబ్ ఎందుకు ఆడడం లేదు..?
కీలకమైన ఈ మ్యాచ్‌లో షకీబ్ ఆడకపోవడానికి గల కారణాలను నెటీజన్లు అన్వేషిస్తున్నారు. టాస్‌కు ముందు షకీబ్ ఆడడం లేడని ప్రకటించారు. అతడు ఆడకపోవడానికి గల కారణాన్ని స్టాండ్ ఇన్ కెప్టెన్ శాంటో చెప్పాడు. టాస్ గెలిచిన అనంతరం శాంటో మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నాకు, నా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఈ రోజు మేము మొదట బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నాము. భారీ స్కోరు చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెడతాము.’ అని అన్నాడు.
‘షకీల్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అతడికి అయిన గాయం పూర్తిగా మానలేదు. అతడి స్థానంలో నసుమ్ వచ్చాడు. టీమ్ఇండియా పై మాకు కొన్ని గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఇది ఓ మరుపురాని మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా.’ అంటూ శాంటో చెప్పాడు.
Virat Kohli : ఇదీ చూశారా.. 8 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ బౌలింగ్.. సూపరో సూపర్.. వీడియో వైరల్
కాగా.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుతో బంగ్లాదేశ్ తలపడింది. ఆ మ్యాచ్‌లో పరుగెత్తే క్రమంలో షకీబ్ గాయపడ్డాడు. ఈ గాయం నుంచి షకీబ్ పూర్తిగా కోలుకులేదు. అయితే.. బుధవారం షకీబ్ గాయం పై బంగ్లాదేశ్ కోచ్ చండికా హతురుసింగ మాట్లాడుతూ.. అతడు ఆడడానికి సిద్ధం ఉన్నట్లు చెప్పాడు. అయితే.. ఎలాంటి రిస్క్ తీసుకోవాలని మేము అనుకోవడం లేదు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడు బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి ఇబ్బంది పడలేదు. అతడి గాయానికి స్కానింగ్ చేశారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాము. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉంటే గురువారం భారత్‌తో మ్యాచ్‌లో ఆడతాడని అన్నాడు.
