Vaibhav Sooryavanshi : భారత అండర్-19 జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. 2016లో బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే కారణమా?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న యూత్ వన్డేల కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi ) చోటు దక్కలేదు.
- Thota Vamshi Kumar
- Published on- August 28, 2026 / 12:17 PM IST
Why Was Vaibhav Sooryavanshi Not Selected In India U19 Squad
Vaibhav Sooryavanshi : స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న యూత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు.. ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌లు చోటు దక్కించుకున్నారు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.
టీమ్ఇండియా సీనియర్ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి మెరుపులు మెరిస్తున్న వైభవ్‌కు జూనియర్ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. అతడిని ఎంపిక చేయకపోవడానికి బీసీసీఐ కీలక నిబంధననే కారణం. ఈ నిబంధనను 2016లో బీసీసీఐ తీసుకువచ్చింది.
R Praggnanandhaa : చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన ఏకైక భారతీయుడు..
వయసు పరంగా అర్హత ఉన్నప్పటికి కూడా ప్లేయర్లు అండర్-19 ప్రపంచకప్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఆడాల్సి ఉంటుంది. రెండోసారి ఆడేందుకు అవకాశం లేదు. వైభవ్ సూర్యవంశీ 2026 అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మరో ఎడిషన్‌లో పాల్గొనలేడు. అందుకనే అండర్-19 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి వైభవ్ ను సెలక్టర్లు పక్కన పెట్టేశారు.
ఈ నిబంధన కారణంగా వాషింగ్టన్ సుందర్ 2018లో అండర్-19 ప్రపంచ కప్ ఆడలేకపోయాడు. ఈ నిబంధన అమల్లోకి రాకముందు సర్ఫరాజ్ ఖాన్, సందీప్ శర్మ, విజయ్ జోల్ తదితర ఆటగాళ్లు రెండు సార్లు అండర్-19 ప్రపంచకప్‌లు ఆడారు.
ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సిద్ధం అవుతున్నాడు.
భారత అండర్-19 వన్డే జట్టు ఇదే..
లక్ష్యరాయ్ చందాని (కెప్టెన్), యశ్ వర్ధన్ చౌహన్, రజత్ బఘేల్, ఆర్యవీర్ సెహ్యాగ్, అన్వయ్ ద్రవిడ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, యశ్ వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకటనాగ విజయ సుభాశ్, కావ్య పటేల్.
🚨 News 🚨
India U19 squad for Australia U19 Men’s Tour of India announced.
The tour consists of three One-Day matches and two Multi-Day fixtures.
Venues 🏟️: Rajkot and Ahmedabad
More Details ▶️ https://t.co/o2pF8bj3RJ
#INDU19vAUSU19 pic.twitter.com/Ud0tvcqaBe
— BCCI (@BCCI) August 27, 2026
