Babar Azam : అరే.. అజామూ.. ఇదేం ద‌రిద్రం రా సామీ..

టెస్టుల్లో పాకిస్థాన్ స్టార్ బ్యాట‌ర్, కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ (Babar Azam) శ‌త‌క‌ నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది.

WI vs PAK 2nd Test Babar Azam Run Out video viral

Babar Azam : టెస్టుల్లో పాకిస్థాన్ స్టార్ బ్యాట‌ర్, కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ శ‌త‌క‌ నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ కుడిచేతివాటం ఆట‌గాడు ఒక్క శ‌త‌కాన్ని న‌మోదు చేయ‌లేక‌పోయాడు. వెస్టిండీస్‌తో ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దుర‌దృష్టం అత‌డిని వెంటాడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అత‌డు 88 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 75వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జోమ‌ల్ వార‌గ‌న్ బౌలింగ్ లో బాబ‌ర్ క‌వ‌ర్స్ దిశ‌గా చ‌క్క‌ని షాట్ ఆడాడు. సింగిల్ కోసం వేగంగా ప‌రిగెత్తాడు అయితే.. మ‌రో ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా ష‌ఫీక్ ప‌రుగు తీసేందుకు నిరాక‌రించాడు. అయితే.. అప్ప‌టికే బాబ‌ర్ స‌గానికి పైగా క్రీజును దాటేశాడు. చేసేది లేక మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి ప‌రిగెత్తాడు. అయితే.. అత‌డు క్రీజును చేరుకునేలోపు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోయింది.

Sara Tendulkar : ఫారెన్ బీచ్‌లో స‌చిన్ కూతురు.. సారా టెండూల్క‌ర్‌ క్యూట్ పిక్స్ వైర‌ల్‌..

బంతిని అందుకున్న బ్రాండ‌న్ కింగ్ డైరెక్ట్ త్రో స్టంప్స్‌ను ప‌డేశాడు. దీనిని గ‌మ‌నించిన బాబ‌ర్ డైవ్ చేసిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక‌పోయింది. ర‌నౌట్ కావ‌డంతో బాబ‌ర్ ఆజామ్ తీవ్ర నిరాశ‌కు గురి అయ్యాడు. కొన్ని క్ష‌ణాలు మైదానంలోనే మోకాళ్ల‌పై కూర్చుండి పోయాడు. బాబ‌ర్ ఆజామ్ చివ‌రి సారిగా 2022 డిసెంబ‌ర్‌లో క‌రాచీలో న్యూజిలాండ్ పై టెస్టుల్లో సెంచ‌రీ చేశాడు.

ఆధిక్యంలో పాక్‌..

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ అజేయంగా 160 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌కు 43 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. అంత‌క‌ముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 344 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

పాక్ తొలి ఇన్నింగ్స్ అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌న వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 6 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం విండీస్ 60 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. జ‌స్టిన్ గ్రీవ్ (1) క్రీజులో ఉన్నాడు.