×
Ad

T20 World Cup 2026 : పాక్ వ‌ర్సెస్ అమెరికా మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉందా?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా మంగ‌ళ‌వారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌ వేదిక‌గా పాకిస్థాన్‌, యూఎస్ఏ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Will rain play spoilsport in PAK vs USA T20 World Cup 2026 clash

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా మంగ‌ళ‌వారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌ వేదిక‌గా పాకిస్థాన్‌, యూఎస్ఏ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్‌ను అమెరికా ఓడించ‌డంతో ఈ మ్యాచ్ పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

పాక్, అమెరికా జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మెగా టోర్న‌మెంట్‌లో (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో) ఒక్కొ మ్యాచ్‌ను ఆడాయి. తొలి మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ పై పాక్ విజ‌యం సాధించింది. ఇక భార‌త్‌తో ఆడిన త‌మ తొలి మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన అమెరికా ల‌క్ష్య ఛేద‌న‌లో విఫ‌ల‌మైంది. అయితే.. పాక్ తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించి విజ‌యం సాధించాల‌ని అమెరికా ఆరాట‌ప‌డుతోంది.

వ‌ర్షం ముప్పు ఉందా?
ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు లేదు. మంగ‌ళ‌వారం కొలంబోలో వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. మ్యాచ్‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌ద‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అయితే.. ఆకాశం మేఘావృతమై ఉంటుంద‌ట‌. ఈ ప‌రిస్థితులు బౌల‌ర్ల‌కు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. రాత్రి పూట 23 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త ఉంటుందని పేర్కొంది.

T20 World Cup 2026 : దంచికొట్టిన బాస్ డి లీడే.. గెలుపు బోణీ కొట్టిన నెద‌ర్లాండ్స్.. న‌మీబియాపై ఘ‌న విజ‌యం..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం స్క్వాడ్‌లు ఇవే..

పాకిస్థాన్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్.

T20 World Cup 2026 : పాక్‌కు యూఎస్ఏ ప్లేయ‌ర్ వార్నింగ్‌.. మ‌రోసారి ఓడిస్తాం.. మొహ్సిన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

అమెరికా జ‌ట్టు..
మోనాంక్ పటేల్ (కెప్టెన్‌), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, షుభామ్ రంజానే.