IND W vs THA W : టీ20ల్లో అరంగ్రేటం చేసిన ప్ర‌తీకా రావ‌ల్‌.. టాస్ ఓడిన భార‌త్‌.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఏమ‌న్న‌దంటే?

మ‌హిళ‌ల ఆసియాక‌ప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, థాయ్‌లాండ్ జట్ల మధ్య మ్యాచ్ (IND W vs THA W) ప్రారంభమైంది.

Womens Asia Cup 2026 IND W vs THA W Thailand Women opt to bowl

IND W vs THA W : మ‌హిళ‌ల ఆసియాక‌ప్ 2026లో భాగంగా భార‌త జ‌ట్టు త‌మ మొద‌టి మ్యాచ్‌ను ఆడుతోంది. దుబాయ్ వేదిక‌గా థాయ్‌లాండ్‌తో త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన థాయ్‌లాండ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ఇక వ‌న్డేల్లో స‌త్తా చాటుతున్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ ప్రతీకా రావ‌ల్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అరంగ్రేటం చేసింది.

‘మేము కూడా తొలుత బౌలింగ్ చేయాలని అనుకున్నాము. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయాల్సి రావ‌డం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. జెమీమా రోడ్రిగ్స్‌  అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్ర‌తీకా రావ‌ల్ టీ20ల్లో అరంగ్రేటం చేస్తోంది. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. దూకుడుగా ఆడ‌డం గురించే చర్చించుకున్నాము. అలాగే ఇది మాకు చాలా ముఖ్యమైన టోర్నమెంట్.’ అని హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అంది

భారత తుది జట్టు ఇదే..
స్మృతి మంధాన‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, ప్ర‌తీకా రావ‌ల్‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ