IND W vs THA W : షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ.. థాయ్‌లాండ్ లక్ష్యం ఎంతంటే?
ఫెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ చేయడంతో థాయ్‌లాండ్ ముందు భారత్ మంచి (IND W vs THA W ) లక్ష్యాన్నే ఉంచింది.
- Thota Vamshi Kumar
- Published on- August 30, 2026 / 09:44 PM IST
Womens Asia Cup 2026 Shafali Verma half century Thailand target is 160
IND W vs THA W : మహిళల టీ20 ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (64; 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
Innings Break!
Shafali Verma top-scores with 64(36) as #TeamIndia set a target of 1⃣6⃣0⃣
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/Tgf2CJnHta#WomensAsiaCup | #INDvTHAI pic.twitter.com/PT6FOMmbqG
— BCCI Women (@BCCIWomen) August 30, 2026
మిగిలిన వారిలో ప్రతీకా రావల్ (22; 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (19; 10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), క్రాంతి గౌడ్ (15 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించింది. థాయ్‌లాండ్ బౌలర్లలో సులీపోర్న్ లావోమి మూడు వికెట్లు తీసింది. సునిదా చతురోంగ్-రత్తన రెండు వికెట్లు పడగొట్టింది. తిప్చా పుట్టావోంగ్ , చనిద సుత్తిరుయాంగ్ చెరో వికెట్ సాధించారు.
