Women’s T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 5, 2024 / 02:31 PM IST
Women's T20 World Cup 2024 schedule
Women’s T20 World Cup 2024 schedule : మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 20 వరకు జరగనున్న ఈ టోర్నీలో 23 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 10 జట్లు ఈ పొట్టి ప్రపంచకప్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే 8 అర్హత సాధించగా.. క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా మరో రెండు జట్లు పోటీలో పాల్గొంటాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, క్వాలిఫయర్ 1 ఉండగా.. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్తో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డేలు ఉన్నాయి.
Anushka Sharma : కోహ్లికి లైఫ్.. లేదంటే డకౌట్ అయ్యేవాడే.. అనుష్క శర్మ రియాక్షన్ చూశారా?
మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్..
అక్టోబర్ 3 – ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా – ఢాకా వేదిక
అక్టోబర్ 3 – బంగ్లాదేశ్ vs క్వాలిఫైయర్ 2 – ఢాకా
అక్టోబర్ 4 – ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్
అక్టోబర్ 4 – భారత్ vs న్యూజిలాండ్ – సిల్హెట్
అక్టోబర్ 5 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – ఢాకా
అక్టోబర్ 5 – బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ – ఢాకా
అక్టోబర్ 6 – న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్
అక్టోబర్ 6 – భారత్ vs పాకిస్థాన్ – సిల్హెట్
అక్టోబర్ 7 – వెస్టిండీస్ vs క్వాలిఫయర్ 2 – ఢాకా
అక్టోబర్ 8 – ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – సిల్హెట్
అక్టోబర్ 9 – బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ – ఢాకా
అక్టోబర్ 9 – భారత్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్
అక్టోబర్ 10 – దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2 – ఢాకా
అక్టోబర్ 11 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – సిల్హెట్
అక్టోబర్ 11 – పాకిస్థాన్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్
అక్టోబర్ 12 – ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – ఢాకా
అక్టోబర్ 12 – బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా – ఢాకా
అక్టోబర్ 13 – పాకిస్థాన్ vs న్యూజిలాండ్ – సిల్హెట్
అక్టోబర్ 13 – భారత్ vs ఆస్ట్రేలియా – సిల్హెట్
అక్టోబర్ 14 – ఇంగ్లండ్ vs క్వాలిఫైయర్ 2 – ఢాకా
అక్టోబర్ 17 – మొదటి సెమీ-ఫైనల్ – సిల్హెట్
అక్టోబర్ 18 – రెండవ సెమీ-ఫైనల్ – ఢాకా
అక్టోబర్ 20 – ఫైనల్ – ఢాకా
Dinesh Karthik : కాఫీ కూడా తాగనివ్వలేదురా అయ్యా.. ఆర్సీబీ వికెట్ల పతనం పై దినేశ్ కార్తీక్
