Anushka Sharma : కోహ్లికి లైఫ్.. లేదంటే డకౌట్ అయ్యేవాడే.. అనుష్క శర్మ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

Anushka Sharma's Reaction As Virat Kohli Survives Run Out
Anushka Sharma Reaction : ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గుజరాట్ తొలుత బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాటియా (35) లు ఫర్వాలేదనిపించారు.
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు ఓపెనర్లు డుప్లెసిస్ (23 బంతుల్లో 64), విరాట్‌కోహ్లి (27 బంతుల్లో 42) బరిలోకి దిగారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను మోహిత్ శర్మ వేశాడు. తొలి బంతిని కోహ్లి షాట్ ఆడాడు. అయితే.. గుజరాత్ ఫీల్డర్ డేవిడ్ మిల్లర్ చక్కని డైవ్‌తో బంతిని ఆపాడు. అయితే.. కోహ్లి పరుగు కోసం ముందుకు వెళ్లాడు. బంతిని ఆపిన మిల్లర్ వెంటనే వికెట్ల వైపుకు బంతిని త్రో చేశాడు.
Virat Kohli : టీ20ల్లో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు.. టీమ్ఇండియా క్రికెటర్లలో ఒకే ఒక్కడు
అయితే.. బంతి వికెట్లను తాకలేదు. ఒకవేళ తాకి ఉంటే కోహ్లి రనౌట్ అయ్యేవాడు. ఎందుకంటే కోహ్లి తన బ్యాట్ పై నియంత్రణ కోల్పోయాడు. వికెట్ల దగ్గరకు బాల్ వచ్చిన సమయంలో అతడు ఫ్రేమ్‌లో ఎక్కడా కనిపించలేదు. బాల్ వికెట్లను తగిలి ఉంటే కోహ్లి డకౌట్ అయ్యేవాడు. ఈ లైప్‌ని సద్వినియోగం చేసుకున్న కోహ్లి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కోహ్లి, డుప్లెసిస్ రాణించడంతో లక్ష్యాన్ని బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఇక ఈ మ్యాచ్ చూసేందుకు కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వచ్చింది. కాగా.. కోహ్లి రనౌట్ కాకుండా బతికిపోయిన క్రమంలో ఆమె ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లి సికర్లు,ఫోర్లు కొడుతున్నప్పడు ఆమె చప్పట్లతో అతడిని ఎంకరేజ్ చేసింది.
Anushka Sharma’s reaction after Virat Kohli survived a run out. pic.twitter.com/BcSl7kUE8L
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2024