Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో (Womens T20 World Cup 2026) భారత్ అదరగొడుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- June 17, 2026 / 10:32 PM IST
Womens T20 World Cup 2026 India Women won by 95 runs against Netherlands
- టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత్..
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. ఆదివారం పాక్‌ను చిత్తు చేసిన భారత్ బుధవారం లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు పై ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొందింది.
210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో బాబెట్ డి లీడ్ (28), హెదర్ సీగర్స్ (21) లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లు పడగొట్టింది. షఫాలీ వర్మ మూడు వికెట్లు తీసింది. నందని శర్మ రెండు వికెట్లు, దీప్తి శర్మ ఓ వికెట్ సాధించింది.
IND vs AFG : రెండో వన్డేలో అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలి ఉండానే సిరీస్ కైవసం
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (74; 47 బంతుల్లో 11 పోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (55; 38 బంతుల్లో 10 ఫోర్లు) అర్థశతకాలు బాదారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే రెండు వికెట్లు తీసింది. ఐరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, మిర్తే వాన్ డెన్ రాడ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
