Yuvraj Singh : యువ‌రాజ్ సింగ్ విధ్వంసం.. 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు.. ఆసీస్ పై భార‌త్ విజ‌యం..

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ లెజెండ్స్ 2026లో భాగంగా ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ (Yuvraj Singh) విధ్వంసం సృష్టించాడు

World Championship of Legends 2026 Yuvraj Singh smashes 71 from 44 balls against Australia

Yuvraj Singh : వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ లెజెండ్స్ 2026లో ఇండియా ఛాంపియ‌న్స్ శుభారంభం చేసింది. శ‌నివారం షార్జా వేదిక‌గా ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ 46 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఛాంపియ‌న్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ యువ‌రాజ్ సింగ్ (71; 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించాడు. యూసుఫ్ ప‌ఠాన్ (37; 20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు), రిషి ధావ‌న్ (35 నాటౌట్; 12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించారు. న‌వ‌న్ ఓజా (31) ప‌ర్వాలేద‌నిపించ‌గా.. అంబ‌టి రాయుడు (3 బంతుల్లో 4), స్టువ‌ర్ట్ బిన్ని (13), ఇర్ఫాన్ ప‌ఠాన్ (1)లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో బెన్ హిల్ఫెన్‌హాస్, బెన్ లాఫ్లిన్, ఫవాద్ అహ్మద్ లు త‌లా రెండు వికెట్లు తీశారు.

Sree Charani : దుబాయ్‌లో శ్రీచ‌ర‌ణి.. ఫోటోలు వైర‌ల్..

అనంత‌రం 197 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ 16.2 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో డి ఆర్సీ షార్ట్ (65 ;28 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), జో బర్న్స్ (45; 32 బంతుల్లో 4 సిక్స‌ర్లు) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ధావ‌ల్ కులకర్ణి నాలుగు వికెట్లు తీశారు. మోహిత్ శ‌ర్మ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. పియూష్ చావ్లా రెండు వికెట్లు, హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఓ వికెట్ సాధించాడు.