ఖతార్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో చోటు చేసుకుంది. అరుబా దేశానికి చెందిన రన్నర్ జొనాథన్ బస్బీ ఆఖరి రౌండ్‌లో పరుగెత్తలేకపోయాడు.
నిజమైన విజేతను కొలవడానికి స్టాప్ వాచ్, కొలతల టేప్ ఏమాత్రం అవసరం లేదు. మనసులు గెలిచిన వాడే నిజమైన విజేత. ఇక్కడ పోటీ అనే మాటే లేదు. అటువంటి స్పూర్తిని కనబరిచాడు బ్రామా సన్సార్ దాబో. అతని క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులే కాదు సామాన్య ప్రజలకు కూడా మనస్సుల్లోనే గోల్డ్ మెడల్ ఇచ్చేశారు.
బ్రామా సన్సార్ దాబో అనే వ్యక్తి 5వేల మీటర్ల పరుగుల పోటీలో తన పరుగు ఆపివేసి పక్క వ్యక్తిని గెలిచేందుకు సహకరించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ పోటీని ఇద్దరూ కలిసి పూర్తి చేశారు. ఈ అరుదైన..స్పూర్తినిచ్చే ఘటన ఖతార్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో చోటు చేసుకుంది.
అరుబా దేశానికి చెందిన రన్నర్ జొనాథన్ బస్బీ ఆఖరి రౌండ్‌లో పరుగెత్తలేకపోయాడు. ఇది గమనించిన గున్యా పోటీదారుడు బ్రైమా సుంకర్ డాబో.. తన పరుగును ఆపి బస్సీకి సాయమందించాడు. రౌండ్ పూర్తయ్యేవరకు చేయందుకుని పరుగును పూర్తి చేశాడు.
తోటి రన్నర్లంతా పరుగు పూర్తి చేసిన 5 నిమిషాలకు గమ్యాన్ని చేరుకున్నారు. ఈ ఘటనకు స్పందించిన అభిమానులు స్టేడియంలో డాబోను చప్పట్లతో అభినందించారు. సాయమందుకున్న డాబో తన కెరీర్లో బెస్ట్ టైమ్ తో పరుగును పూర్తి చేయగలిగాడు. దురదృవశాత్తు లైన్ దాటి పరుగెత్తడంతో డాబోపై పరుగు పందెంలో అనర్హత వేటు పడింది.