ENG vs NED : ఇంగ్లాండ్‌కు ఊరట.. నెదర్లాండ్స్ పై ఘన విజయం..
England vs Netherlands : వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు స్వల్ప ఊరట లభించింది. ఈ మెగాటోర్నీలో రెండవ విజయాన్ని నమోదు చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 8, 2023 / 09:23 PM IST
England
వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు స్వల్ప ఊరట లభించింది. ఈ మెగాటోర్నీలో రెండవ విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో తేజ నిడమనూరు (41 నాటౌట్), స్కాట్ ఎడ్వర్డ్స్ (38), వెస్లీ బరేసి (37) లు రాణించిన మిగిలిన వారు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీశారు. డేవిడ్ విల్లీ రెండు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్ ఓ వికెట్ సాధించాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (108; 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేశాడు. డేవిడ్ మలన్(87; 74 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్ వోక్స్(51; 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే 3, ఆర్యన్ దత్ 2, లోగాన్ వాన్ బీక్ 2 వికెట్లు పడగొట్టారు.
