Best Fielder Award : ఓటమి బాధలోనూ బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. ఎవరికి ఇచ్చారో తెలుసా..?
Final match Best Fielder Award : మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ మెడల్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి మెడల్‌ను ఇచ్చారు.
- Thota Vamshi Kumar
- Updated on- November 20, 2023 / 02:31 PM IST
Final match Best Fielder Award
వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకువెళ్లిన టీమ్ఇండియా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు అడియాశలు అయ్యాయి. టీమ్ఇండియా ఆటగాళ్లు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే.. మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ మెడల్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి మెడల్‌ను ఇచ్చారు.
ఎలాంటి హడావుడి లేకుండానే డ్రెస్సింగ్ రూమ్‌లోనే మెడల్‌ను అందించారు. ఆఖరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఫీల్డింగ్ చేసినట్లు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించాడు. గత మ్యాచులో అవార్డు అందుకున్న రవీంద్ర జడేజా చేతుల మీదుగా కోహ్లీ ఈ మెడల్‌ను అందుకున్నాడు.
Team India : చేజారిన కప్.. ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకోలేక..
ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు అని, అయితే ఫలితం అనుకూలంగా రాలేదన్నారు. ప్రతి ఒక్క ఆటగాడికి అభినందలు చెప్పారు. అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారని, ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని చెప్పుకొచ్చాడు. ఇక ఆఖరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చురుగ్గా కదిలాడని, అతడి వల్ల మిగిలిన ఆటగాళ్లలోనూ ఉత్సాహం వచ్చిందన్నారు. కాగా.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు.
అభిమానులకు ధన్యవాదాలు..
గత నెలన్నర రోజులకు పైగా క్రికెట్ అభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్ 2023 ముగిసింది. వరుస విజయాలతో ఫైనల్‌కు వచ్చిన టీమ్ఇండియా ఆఖరి మ్యాచులో ఓటమిపాలైనప్పటికీ అభిమానులు అండగా నిలిచారు. ఈ క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
